డ్రాగన్ ఫ్రూట్ పేరు మార్పు..‘కమలం’ పండుగా మార్చాలని ప్రభుత్వ నిర్ణయం

డ్రాగన్ ఫ్రూట్ పేరు మార్పు..‘కమలం’ పండుగా మార్చాలని ప్రభుత్వ నిర్ణయం

Gujarath : Dragon fruit to be known as ‘Kamalam’ : డ్రాగన్ ఫ్రూట్ పేరు మార్చాలని గుజరాత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ప్రతిపాదనలు కూడా చేసింది. డ్రాగన్ ఫ్రూట్ పేరును ‘కమలం’ పండుగా నిర్ణయించింది. దీనికి సంబంధించి ఇప్పటికే పేటెంట్ మార్పునకు ప్రతిపాదనలు పంపామని సీఎం విజయ్ రూపానీ తెలిపారు.

ఒక పండును డ్రాగన్ అనే పేరుతో పిలవడం వినసొంపుగా లేదనీ..కాబట్టి ఆ పండుకు ‘కమలం’ పండు అని పిలవాలని అదే ఆ పండుకు సరైందని అందుకే ఈ పేరు మార్చాలని నిర్ణయించామని ఇకపై డ్రాగన్ ఫ్యూట్ ను ‘కమలం’ పండు అని పిలవాలని నిర్ణయించుకున్నట్టు సీఎం తెలిపారు.

మంగళవారం (జనవరి 19) హార్టికల్చర్ డెవలప్‌మెంట్ మిషన్ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం విజయరూపాని మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘డ్రాగన్ ఫ్రూట్‌ను కమలం అని పిలవాలంటూ పేటెంట్‌కు ప్రతిపాదనలు చేశామని తెలిపారు. అయితే ఇప్పటికే గుజరాత్ ప్రభుత్వం దీన్ని కమలం పండుగా వ్యవహరించాలని నిర్ణయించింది..’’ అని సీఎం పేర్కొన్నారు.

కాగా..ఈ పేరు మార్పు నిర్ణయం వెనుక ఎటువంటి రాజకీయ కోణం లేదని స్పష్టంచేశారు. గుజరాత్ తో సహా పలు రాష్ట్రాల్లోను..కేంద్రంలోను కూడా బీజేపీ ప్రభుత్వం పాలన ఉంది. దీంతో డ్రాగన్ ఫ్రూట్ పేరును బీజేపీ గుర్తు ‘కమలం’ పేరును ప్రతిపాదించినట్లుగా అనుకోవద్దని దీంట్లో ఎటుఎవరూ రాజకీయం కోణం లేదనే విషయాన్ని గుర్తించాలని తెలిపారు. దయచేసి ఎవ్వరూ రాజకీయ కోణంలో ఆలోచించవద్దని సూచించారు. ‘‘కమలం అనే పదం సంస్కృతం నుంచి వచ్చింది. ఆ పండు కూడా కమలం ఆకారంలో లేదు. అందుకే దీన్ని మేము కమలం అని పిలవాలని భావిస్తున్నాం. దీని వెనుక ఎలాంటి రాజకీయం లేదు..’’ అని రూపానీ వివరించారు.

కాగా భారత్-చైనా దేశాల మధ్య గత కొంతకాలంలో భూ వివాదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. చైనాను డ్రాగన్ దేశం అని పిలుస్తారనే విషయం తెలిసిందే. ఈక్రమంలో చైనా పేరుతో ఉండే డ్రాగన్ ఫ్రూట్ ను మార్చాలని ప్రభుత్వం నిర్ణయించిందని వార్తలు వస్తున్నాయి.

డ్రాగన్ ఫ్రూట్ లో ఎన్నో పోషకపదార్ధాలు సమృద్దిగా ఉన్నాయి. గుజరాత్ లోని కచ్ జిల్లాలో రైతులు ఈ డ్రాగన్ ఫ్రూట్ ను విరివిగా పండిస్తారు. దాదాపు 1000 హెక్టార్లలో ఈ పండును పండిస్తున్నారు గుజరాత్ రైతులు. ఈక్రమంలో గుజరాత్ రైతులు పండించే ఈ పండుకు గుజరాత్ లో పాలనలో ఉండే ‘కమలం’గుర్తు పేరును పెడుతున్నట్లుగా కొందరు అంటున్నారు.

దీనిపై ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ ప్రభుత్వం పండ్ల పేరును మార్చటం హాస్యాస్పదనమని విమర్శిస్తున్నారు. బీజేపీ ప్రభుత్వానికి ప్రజల సంక్షేమం కాకుండా పేర్లు మార్చే పనిలో పడిందని ఎద్దేవా చేస్తున్నారు.అయితే..ప్రధాని మోడీ మన్ కీ బాత్ రేడియో ప్రసంగంలో కూడా రైతు సంపాదన పెంచటానికి ఉద్యానవన పంటల్లో డ్రాగన్ ఫ్రూట్స్ పెంపకం గురించి ప్రత్యేకంగా మాట్లాడిన విషయం తెలిసిందే.