Palanpur Seed Bank : అంతరించే మొక్కల్ని కాపాడుతున్న యువ టీచర్..ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌ గుర్తింపు

అంతరించిపోయే మొక్కల విత్తనాలను దేశమంతా పంచిపెడుతూ ప్రకృతి ప్రాణదాతగా మారాడు యువ టీచర్ నిరాల్ పటేల్. అతని కృషిని అరుదైన అవార్డు దక్కింది. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌కి అవార్డు నిచ్చి సంత్కరించింది.

Palanpur Seed Bank : అంతరించే మొక్కల్ని కాపాడుతున్న యువ టీచర్..ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌ గుర్తింపు

Palanpur Seed Bank Niral Patel

Palanpur Seed Bank : ఈ సమస్త సృష్టిలో ఎన్నోరకాల జీవులు.. మొక్కలు అంతరించిపోయాయి. అంరించిపోతున్న దశలో ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇప్పటికే పలు రకాల ధాన్యాలు అంరించిపోయాయని తెలుస్తోంది. అలా అన్నీ అంరించిపోతుంటే మానవజాతి మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారే ప్రమాదముంది. అటువంటివాటిని సంరక్షించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అదే చేస్తున్నాడో యువకుడు. అంతరించిపోతున్న మొక్కలను కాపాడుతున్నాడు. చిన్నవయస్సులో పెద్ద బాధ్యతను నిర్వర్తిస్తున్నాడు. పర్యావరణాన్ని కాపాడుతున్నాడు. అతని కష్టాన్ని ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌ నిర్వాహకులు గుర్తించి అవార్డుని ఇచ్చి సత్కరించారు. ఆ ప్రకృతికి ప్రాణదాత పేరు ‘నిరాల్ పటేల్.’గుజరాత్… బనస్కాంత జిల్లాకు చెందిన నిరాల్ కు మొక్కలంటే ప్రాణం. 350 రకాల అరుదైన మొక్కలకు సంబంధించిన విత్తనాలను ఉచితంగా పంచుతున్నాడు నిరాల్ పటేల్. అలా సొంతంగా సీడ్ బ్యాంక్ ఏర్పాటుచేసి… అరుదైన మొక్కల్ని కాపాడుతు.. ప్రకృతికి ప్రాణదాతగా మారాడు.

గుజరాత్ రాష్ట్రంలోని బనస్కాంత జిల్లాకు నిరాల్ పటేల్. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌కి ఎక్కాడు. అరుదైన మొక్కలు, వాటి విత్తనాలు సేకరించి పలువురికి పంచుతున్నాడు. కరోనా టైమ్‌లో కూడా నిరాల్ సేవ ఆగలేదు.ప్రపంచం అంతా కరోనా సంక్షోభంలో ఉన్నాగానీ నిరాల్ మాత్రం తన మొక్కల సంరక్షణలో బిజీగానే ఉన్నాడు.తన బాధ్యతను నిర్వర్తిస్తూనే ఉన్నాడు. కోటికి పైగా విత్తనాలను దేశ ప్రజలకు ఉచితంగా ఇచ్చాడు.29 ఏళ్ల నిరాల్ పటేల్ బనస్కాంతలోని పలన్‌పూర్‌లో నివసిస్తున్నాడు. దంతెవాడలో మోడల్ స్కూల్‌లో టీచర్ గా పనిచేసే నిరాల్ కు కరోనా వల్ల స్కూల్స్ మూసివేయడంతో కొత్త మార్గాన్ని వెదుక్కున్నాడు. అదిడబ్బులు సంపాదించటానికి కాదు..ప్రకృతికి ప్రాణం పోయటానికి. స్కూల్ మూసివేసాక నిరాల్ ఇంట్లోనే ఉండిపోలేదు. అరుదైన మొక్కల్ని, వాటి విత్తనాల్ని సేకరించడం ప్రారంభించాడు.

ఇప్పటివరకూ 350 రకాల అరుదైన మొక్కలు, చెట్లు, పాదుల విత్తనాలు సేకరించాడు. వాటిని తనలాంటి ప్రకృతి ప్రేమికులకు ఉచితంగా ఇచ్చాడు. అలాగే సోషల్ మీడియాలో చాలా ఎన్విరాన్‌మెంటల్ గ్రూపుల్లో చేరాడు. తద్వారా… అరుదైన మొక్కల వివరాలు తెలుసుకున్నాడు. అడవుల్లో తిరిగి… అలాంటి వాటిని సేకరించాడు. తర్వాత… వాటిని కోరేవారి వివరాల్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకొని… వారికి ఉచితంగా ఇస్తున్నాడు.ఆ విషయాన్ని ఫేస్‌బుక్‌లో ‘పలన్‌పూర్ సీడ్ బ్యాంక్’ పేరుతో ఓ పేజీని క్రియేట్ చేసి..ఎంతోమందికి దగ్గరయ్యాడు. దాని ద్వారా 10వేల మందికి కోటి విత్తనాలు ఇచ్చాడు.వాటిని మొక్కలు మార్చి మరింతగా పెంచమని ప్రోత్సహించాడు. కేవలం గుజరాత్‌ లోనే కాదు ఇతర రాష్ట్రాలవారికి కూడా నిరాల్ ఇచ్చిన విత్తనాలను తీసుకున్నారు. కొరియర్ ద్వారా విత్తనాలను పలువురు పంపించేవాడు నిరాల్. ఇలా అరుదైన విత్తనాలను సంరక్షిస్తూ వాటిని విస్తరించేలా చేస్తున్న నిరాల్ కృషిని ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ నిర్వాహకులు గుర్తించారు. అవార్డు ఇచ్చి సత్కరించారు. గోల్డ్ మెడల్, సర్టిఫికెట్‌తో సత్కరించింది.

నిరాల్ పటేల్ ప్రజలను కోరేది..ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటాలి..వాటిని సంరక్షించాలి. విత్తనాలను నాటి మొక్కల్ని పెంచాలి. అవి చెట్లుగా మారేదాకా వాటిని సంరక్షించాలి. అది చిన్ననాటినుంచే పిల్లలకు ప్రతీ తల్లిదండ్రులు అలవాటు చేయాలని కోరాడు.మొక్కలు మన నుంచి కోరేది ఏమీ ఉండదు.. రోజూ కాసిన్ని నీరు పోస్తే అవే మన ఆరోగ్యంగా ఉండటానికి సహాయం పడతాయి.కాబట్టి అందరూ మొక్కల్ని పెంచండీ వాటిని సంరక్షించండీ అని కోరుతున్నాడు నిరాల్ పటేల్. హ్యాట్సాఫ్ నిరాల్ పటేల్.