SreeLeela : దర్శకేంద్రుడు వదులుతున్న మరో అందాల బాణం.. శ్రీలీల..

శ‌తాధిక ద‌ర్శ‌కుడు త‌న గోల్డెన్ హ్యాండ్‌తో మ‌రో అందాల భామ‌ను ‘పెళ్లి సంద‌D’ చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం చేస్తున్నారు. ఆ అందం పేరే.. శ్రీలీల‌..

SreeLeela : దర్శకేంద్రుడు వదులుతున్న మరో అందాల బాణం.. శ్రీలీల..

Happy Birthday Sreeleela From Team Pelli Sandad

SreeLeela: కమర్షియల్.. భక్తి రస చిత్రాలతో క్లాస్‌, మాస్‌, ఫ్యామిలీస్ సహా అన్నివర్గాల ప్రేక్షకులను అల‌రించిన దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు గురించి ప్ర‌త్యేక‌మైన ప్ర‌స్తావ‌న అక్క‌ర్లేదు. అగ్ర క‌థానాయ‌కులంద‌రితో బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాల‌ను రూపొందించారు. క‌థానాయ‌కుల‌నే కాదు.. ఎంద‌రో హీరోయిన్స్‌ను టాలీవుడ్‌కు ప‌రిచ‌యం చేసిన గోల్డెన్ హ్యాండ్ ఆయ‌న‌ది. హీరోయిన్స్‌ను ఎంతో అందంగా మ‌రే ద‌ర్శ‌కుడు చూపించ‌నంత గ్లామ‌ర‌స్‌గా చూపించ‌డం ఆయ‌న‌కే చెల్లింది. ఇది ఎవ‌రూ కాద‌న‌లేని నిజం. అలాంటి శ‌తాధిక ద‌ర్శ‌కుడు త‌న గోల్డెన్ హ్యాండ్‌తో మ‌రో అందాల భామ‌ను ‘పెళ్లి సంద‌D’ చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం చేస్తున్నారు. ఆ అందం పేరే.. శ్రీలీల‌.

ఈ బ్యూటీ డాల్ పుట్టిన‌రోజు సోమ‌వారం(జూన్ 14). ఈ సంద‌ర్భంగా ‘పెళ్లి సంద‌D’ యూనిట్ సినిమా నుంచి శ్రీలీల గ్లింప్స్‌ను విడుద‌ల చేసింది. రాఘ‌వేంద్రుడి ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో.. ఆయ‌న శిష్యురాలు, చిత్ర‌ ద‌ర్శ‌కురాలు గౌరి రోణంకి, శ్రీలీలను అంతే గ్లామ‌ర‌స్‌గా తెర‌కెక్కించిన‌ట్లు గ్లింప్స్‌ చూస్తే అర్థ‌మ‌వుతుంది. శ్రీలీల బెంగుళూరులో స్థిర‌ప‌డ్డ తెలుగు ఫ్యామిలీకి చెందిన అమ్మాయి. మెడిసిన్ చ‌దువుతుంది. అయితే న‌ట‌న‌పై ఆస‌క్తితో సినీ రంగంలో అవ‌కాశాల కోసం చూస్తున్న త‌రుణంలో రాఘ‌వేంద్రరావు సూచ‌న మేర‌కు గౌరి రోణంకి, శ్రీలీలను హీరోయిన్‌గా ఎంపిక చేశారు.

హాకీ, స్విమ్మింగ్ వంటి స్పోర్ట్స్‌తో పాటు క్లాసిక‌ల్ డాన్స్‌.. బాలే డాన్స్‌లోనూ శ్రీలీలకు మంచి ప్రావీణ్యం ఉంది. ఎంద‌రో హీరోయిన్స్‌ను తెలుగు తెర‌కు ప‌రిచ‌యం చేయ‌డం, తెలుగు వారి హృద‌యాల్లో వారికి సుస్థిర‌మైన స్థానాన్ని క‌లిగించిన ద‌ర్శ‌కేంద్రుడి ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రూపొందుతోన్న ‘పెళ్లి సంద‌D’ చిత్రంలో న‌టించ‌డం హీరోయిన్‌గా త‌న‌కెంతో ప్ల‌స్ అని హీరోయిన్ శ్రీలీల తెలియ‌జేసింది.

ఆర్కా మీడియా వ‌ర్క్స్‌, ఆర్‌.కె ఫిలిం అసోసియేట్స్ బ్యాన‌ర్స్‌పై కె.కృష్ణ మోహ‌న్ రావు స‌మ‌ర్ప‌ణ‌లో ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు అందిస్తున్న చిత్రం ‘పెళ్లిసంద‌D’. గౌరి రోణంకి ద‌ర్శ‌కురాలు. మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మాత‌లు. రోష‌న్, శ్రీ‌లీల హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.

‘‘మా గురువుగారు రాఘ‌వేంద్ర‌రావు, స్వ‌ర‌వాణి కీర‌వాణి కాంబినేష‌న్‌లో సూప‌ర్ హిట్ సినిమా రూపొందింద‌ని న‌మ్మ‌కంగా చెబుతున్నాను. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో ఎన్నో మ్యూజిక‌ల్ సెన్సేష‌న్స్ రూపొందాయి. అదే స్టైల్లో ఈ సినిమాలోని పాట‌ల‌కు ఇప్ప‌టికే అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. ఏడు రోజుల ప్యాచ్ వ‌ర్క్ మిన‌హా షూటింగ్ పూర్త‌య్యింది. లాక్‌డౌన్ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డ‌గానే షూటింగ్‌ పూర్తి చేసి వీలైనంత త్వ‌ర‌గా సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తాం’’ అని డైరెక్ట‌ర్ గౌరి రోణంకి తెలిపారు.

నటీనటులు
రోష‌న్, శ్రీ‌లీల, ప్ర‌కాష్ రాజ్‌, రాజేంద్ర ప్ర‌సాద్‌, రావు ర‌మేష్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, పోసాని కృష్ణ ముర‌ళి, వెన్నెల కిషోర్‌, స‌త్యం రాజేష్‌, రాజీవ్ క‌నకాల‌, శ్రీ‌నివాస్ రెడ్డి, షక‌లక శంక‌ర్‌, అన్న‌పూర్ణ‌, ఝాన్సీ, ప్ర‌గ‌తి, హేమ‌, కౌముది, భ‌ద్రం, కిరీటి త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం
సంగీతం: ఎం.ఎం.కీర‌వాణి
సాహిత్యం: శివ‌శ‌క్తి ద‌త్త‌, చంద్ర‌బోస్
సినిమాటోగ్ర‌ఫి: సునీల్ కుమార్ నామ
ఎడిట‌ర్‌: త‌మ్మిరాజు
ఆర్ట్‌: కిర‌ణ్ కుమార్ మ‌న్నె
‌మాట‌లు: శ్రీ‌ధ‌ర్ సీపాన‌
ఫైట్స్‌: వెంక‌ట్
కొరియోగ్ర‌ఫీ: శేఖ‌ర్ వీజే
ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్‌: వి. మోహ‌న్ రావు,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: సాయిబాబా కోవెల‌మూడి
స‌మ‌ర్ప‌ణ‌: కె. కృష్ణ‌మోహ‌న్ రావు‌
నిర్మాత‌లు: మాధ‌వి కోవెల‌మూడి, శోభు యార్ల‌గడ్డ‌, ప్ర‌సాద్ దేవినేని
ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌: కె. రాఘ‌వేంద్ర‌రావు బి.ఎ
ద‌ర్శ‌క‌త్వం: గౌరీ రోణంకి.