Happy New Year 2023 Messages : వాట్సాప్‌లో న్యూ ఇయర్ స్టిక్కర్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసా? ఇదిగో ప్రాసెస్..!

Happy New Year 2023 Messages : 2023 ఏడాదికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. కొత్త ఆశలతో కొత్త ఏడాదిని స్వాగతించడానికి 2023 సంవత్సరం అంతా సిద్ధంగా ఉంది.

Happy New Year 2023 Messages : వాట్సాప్‌లో న్యూ ఇయర్ స్టిక్కర్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసా? ఇదిగో ప్రాసెస్..!

Happy New Year 2023 Messages _ How to create New Year WhatsApp Sticker, GIFs, and wish loved ones

Happy New Year 2023 Messages : 2023 ఏడాదికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. కొత్త ఆశలతో కొత్త ఏడాదిని స్వాగతించడానికి 2023 సంవత్సరం అంతా సిద్ధంగా ఉంది. ప్రతి ఒక్కరూ 2022కి వీడ్కోలు పలుకుతూ.. పార్టీలు, పర్యటనలతో సిద్ధంగా ఉన్నారు. ప్రియమైన వారితో గిఫ్ట్‌లు షేర్ చేసుకోవచ్చు.

ఈ ఏడాది సానుకూలంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ తమకు ఇష్టమైన వారికి శుభాకాంక్షలు తెలియజేసుకోవచ్చు. కొత్త ఏడాది సందర్భంగా WhatsApp స్టిక్కర్‌లు, GIFలను క్రియేట్ చేసి షేర్ చేసుకోవచ్చు.

మీరు ప్రియమైన వారితో ఫొటోలు, వీడియోలను షేర్ చేయవచ్చు. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేయొచ్చు.

వాట్సాప్‌లో న్యూ ఇయర్ స్టిక్కర్‌లను డౌన్‌లోడ్ చేయడం ఎలా? :

* Google Play Store లేదా Apple యాప్ స్టోర్‌ని ఓపెన్ చేయండి.
* ఇప్పుడు న్యూ ఇయర్ స్టిక్కర్ల కోసం సెర్చ్ చేయండి.
* మీరు ఉపయోగించే స్టిక్కర్ ప్యాక్‌ని ఓపెన్ చేసి ఇన్‌స్టాల్ చేయండి.
* ఆ తర్వాత, ఇన్‌స్టాల్ చేసిన స్టిక్కర్ ప్యాక్ యాప్‌ని ఓపెన్ చేసి.. వాట్సాప్‌కి స్టిక్కర్‌లను యాడ్ చేయండి.
* WhatsApp చాట్‌లో కొత్త స్టిక్కర్‌లను ఇలా పంపాలి.
* మీరు WhatsAppని ఓపెన్ చేసి.. మీరు న్యూ ఇయర్ స్టిక్కర్లను పంపే చాట్ లేదా గ్రూప్‌కి వెళ్లవచ్చు.
* ఇప్పుడు చాట్‌లోని మెసేజ్ బాక్స్‌లో ఇన్‌స్టాల్ చేసిన న్యూ ఇయర్ స్టిక్కర్ల కోసం సెర్చ్ చేయండి.

Happy New Year 2023 Messages _ How to create New Year WhatsApp Sticker, GIFs, and wish loved ones

Happy New Year 2023 Messages _ How to create New Year WhatsApp Sticker

Read Also : New Year 2023 : వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా 2023 న్యూ ఇయర్ స్టిక్కర్‌లను ఎలా పంపాలో తెలుసా? ఇదిగో ప్రాసెస్!

* స్టిక్కర్లు ఎమోజీ సెక్షన్‌లో అందుబాటులో ఉన్నాయి.
* ఆ తర్వాత, నావిగేట్ చేసి, మీకు నచ్చిన కొత్త సంవత్సర స్టిక్కర్‌ను ఎంచుకోండి.
* మీరు షేర్ చేయాలనుకుంటున్న స్టిక్కర్‌ను Tap చేసి పంపండి.
* Whatsappలో కేటగిరీ చేసిన నూతన సంవత్సర GIFని ఎలా క్రియేట్ చేయాలి.
* మీ iOS లేదా Android స్మార్ట్‌ఫోన్‌లో WhatsApp ఓపెన్ చేయండి.
* మీరు నూతన సంవత్సర GIFలను పంపాలనుకుంటున్న పర్సనల్ లేదా గ్రూపు చాట్ విండోను ఓపెన్ చేయండి.
* వాట్సాప్ చాట్ బాక్స్‌లో, అటాచ్‌మెంట్ ఎంపికపై క్లిక్ చేసి, ఆపై గ్యాలరీని ఎంచుకోండి.
* ఇప్పుడు మీ ఫోన్ గ్యాలరీని బ్రౌజ్ చేయండి. మీరు GIFలో క్రియేట్ చేయాలనుకునే వీడియోను కనుగొనండి.
* వాట్సాప్ ప్రివ్యూ విండోలో వీడియోను ఎంచుకుని ఆరు సెకన్లలో ట్రిమ్ చేయండి.
* ఇప్పుడు ప్రివ్యూ విండోలో GIF ఐకాన్‌పై Tap చేయండి. వీడియోను GIFగా పంపండి.
* మీరు ఎమోజి సెక్షన్లలో యాప్‌లో కొత్త సంవత్సర GIFలను కూడా కనుగొనవచ్చు.
* Gif విభాగంలో న్యూ ఇయర్ కోసం సెర్చ్ చేయండి.
* ఆపై మీకు నచ్చిన స్టిక్కర్‌ను Tap చేసి పంపండి.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Google Voice : గూగుల్ వాయిస్‌లో కొత్త ఫీచర్.. స్పామ్ కాల్స్ వస్తే వెంటనే యూజర్లను అలర్ట్ చేస్తుంది జాగ్రత్త..!