Harvard Professor: మనుషులంతా ఏలియన్లు చేసిన ప్రయోగమే.. – హార్వర్డ్ ప్రొఫెసర్

మనం చూస్తున్న విశ్వం.. చుట్టూ ఉన్న ప్రపంచం.. గెలాక్సీ.. పాలపుంత అంతా ఏలియన్ల సృష్టి అంటున్నారు హర్వార్డ్ ప్రొఫెసర్.

Harvard Professor: మనుషులంతా ఏలియన్లు చేసిన ప్రయోగమే.. – హార్వర్డ్ ప్రొఫెసర్

Universe

Harvard Professor: మనం చూస్తున్న విశ్వం.. చుట్టూ ఉన్న ప్రపంచం.. గెలాక్సీ.. పాలపుంత అంతా ఏలియన్ల సృష్టి అంటున్నారు హర్వార్డ్ ప్రొఫెసర్. ఆస్ట్రానమీ డిపార్ట్‌మెంట్ హెడ్ అబ్రహాం (ఏవీఐ) లోబ్.. ఏలియన్ జీవితాలపై బుక్స్ కూడా రాశారు. ఈ క్రమంలోనే పాల పుంత, విశ్వం అంతా అడ్వాన్స్‌డ్ టెక్నలాజికల్ సివిలైజేషన్ లో భాగమే.. ఇదంతా ఒక ల్యాబ్ ప్రయోగమే అంటున్నారు.

సైంటిఫిక్ అమెరికన్ అనే జర్నల్ లో.. లోబ్ మిల్కీ వే గురించి దాని చుట్టూ ఉన్న ప్రపంచం గురించి మాట్లాడాడు. క్వాంటమ్ టన్నెలింగ్ టెక్నిక్ ఉపయోగించి బేబీ యూనివర్స్ ను సృష్టించారు. మనుషులకు క్వాంటమ్ మెకానిక్స్, గ్రావిటీ అనే కాంబినేషన్ గురించి తెలియదు. మన క్రియేటర్లు అందులో ఆల్రెడీ టెక్నాలజీ మాస్టర్స్ పూర్తి చేసేశారు.

స్పేస్ స్కేల్ లో.. మనుషులు సీ లెవల్ సివిలైజేషన్.. ఏ-బీ లెవల్ సివిలైజేషన్ వారు కండీషన్స్ ను రీ క్రియేట్ చేయగలరు. ఏ-లెవల్ సివిలైజేషణ్ వారు కాస్మిక్ కండీషన్స్ ను కూడా రీ క్రియేట్ చేయగలరు. అలా సివిలైజేషన్ పెంచుకోగలరు. అలాంటి ఏలియన్సే మనం ఉండే బేబీ యూనివర్స్ ను సృష్టించి ఉండాలి. అని అభిప్రాయపడ్డారు.

……………………………………………..: మెగా ఈవెంట్ బ్రాడ్‌కాస్టింగ్ హక్కులు సొంతం చేసుకున్న YuppTV

నిజానికి మనుషులే మనుషుల్ని సృష్టించినట్లుగా ఆధారాలు ఎక్కడా లేవు. పరిణామ క్రమంలో భూమిపై మానవ మనుగడ మారుతూ వచ్చిందని చెబుతున్నాడు.