KGF Star Yash: హీరో యష్ ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్ అయ్యిందా?

ఒక్క సినిమాతో పాన్ ఇండియా రేంజ్ స్టార్ స్టేటస్ అంటే సాధారణ విషయం కాదు. దాదాపుగా ఇది మరే హీరోకు సాధ్యం కాదేమో. కానీ యాష్ కేజేఎఫ్ చాఫ్టర్ 1తో కన్నడ నుండి ఇండియా లెవెల్ లో ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.

KGF Star Yash: హీరో యష్ ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్ అయ్యిందా?

Hero Yash Facebook Account Hacked

KGF Star Yash: ఒక్క సినిమాతో పాన్ ఇండియా రేంజ్ స్టార్ స్టేటస్ అంటే సాధారణ విషయం కాదు. దాదాపుగా ఇది మరే హీరోకు సాధ్యం కాదేమో. కానీ యాష్ కేజేఎఫ్ చాఫ్టర్ 1తో కన్నడ నుండి ఇండియా లెవెల్ లో ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఆ సినిమాలో నటించిన చాలామందికి మంచి గుర్తింపు దక్కగా హీరో యష్, దర్శకుడు ప్రశాంత్ నీల్ మాత్రం పాన్ ఇండియా రేంజ్ అందుకున్నారు. అందుకే ఇప్పుడు దేశవ్యాప్తంగా సినీ అభిమానులు కేజేఎఫ్ చాఫ్టర్ 2 కోసం వెయిట్ చేస్తున్నారు. అలానే హీరో యష్ గురించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా ఆసక్తిగా చూస్తున్నారు.

కేజేఎఫ్ తరువాత యష్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుండగా కోట్లాదిమంది నెటిజన్లను తన అభిమానులుగా మార్చుకున్నారు. అయితే, లేటెస్ట్ గా యష్ పేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అయ్యినట్టుగా ప్రచారం జరిగింది. కానీ నిజానికి యష్ పేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అవ్వలేదని తెలుస్తుంది. ఏవో కొన్ని టెక్నికల్ ప్రాబ్లెమ్స్ వల్ల సమస్య తలెత్తి ఆటంకం ఏర్పడగా దాన్నే హ్యాక్ అని సోషల్ మీడియాలో కొందరు ప్రచారం చేశారు. యష్ ప్రస్తుతం కేజేఎఫ్ చాఫ్టర్ 2 పనులలో ఉండగా ఎప్పటికప్పుడు ఈ అకౌంట్ ద్వారానే అభిమానులకు అప్డేట్స్ ఇస్తున్నారు.