Pranitha : పండంటి పాపకి జన్మనిచ్చిన హీరోయిన్ ప్రణీత..

తన పాపతో హాస్పిటల్ బెడ్ మీద ఉన్న ఫోటోలని షేర్ చేసి.. ''పాప పుట్టినప్పటి నుంచి నాకు అంతా కలగా అనిపిస్తోంది. గైనకాలజిస్ట్‌ అయిన తల్లి ఉండటం నా అదృష్టం. కానీ.................

Pranitha : పండంటి పాపకి జన్మనిచ్చిన హీరోయిన్ ప్రణీత..

Pranitha

Pranitha :  బావ, అత్తారింటికి దారేది లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి చేరువైన ప్రణీత ఇక్కడ తక్కువ సినిమాలే చేసినా కన్నడలో మాత్రం స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఒకపక్క సినిమాలు చేస్తూనే మరో పక్క ఎన్నో సేవా కార్యక్రమాలతో ప్రజల్లో అభిమానం సంపాదించుకుంది. గత కరోనా లాక్ డౌన్ లో సింపుల్ గా కర్ణాటకకు చెందిన వ్యాపారవేత్త నితిన్‌ రాజును ప్రేమ వివాహం చేసుకుంది ప్రణీత.

ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించింది. ఇక ఇటీవల తల్లి కాబోతున్న విషయాన్ని కూడా సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించి అప్పుడప్పుడు తన బేబీ బంప్ ఫొటోలతో కనువిందు చేసింది. తాజాగా హీరోయిన్ ప్రణీత పండంటి పాపకి జన్మనిచ్చింది.

MS Raju : స్టార్ హీరోల డేట్స్ ఉన్నా వాళ్ళతో సినిమా చేయను..

తన పాపతో హాస్పిటల్ బెడ్ మీద ఉన్న ఫోటోలని షేర్ చేసి.. ”పాప పుట్టినప్పటి నుంచి నాకు అంతా కలగా అనిపిస్తోంది. గైనకాలజిస్ట్‌ అయిన తల్లి ఉండటం నా అదృష్టం. కానీ మానసికంగా మాత్రం ఆమెకు ఇది చాలా కష్ట సమయం. డాక్టర్‌ సునీల్‌ ఈశ్వర్‌, అతడి టీమ్‌ నాకు డెలివరీ బాగా జరిగేలా చూశారు. అలాగే డాక్టర్‌ సుబ్బు, అతడి బృందానికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ స్టోరీ మీకు చెప్పకుండా ఉండలేకపోయాను” అంటూ ఎమోషనల్ గా పోస్ట్ చేసింది ప్రణీత. ఇందులో పాప ముఖాన్ని చూపించలేదు. ప్రణీత తల్లి అయిన సందర్భంగా పలువురు సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.