Products Vegetarian Or Non-Vegetarian : ఏది శాకాహారమో..ఏది మాంసాహారమో వివరించాలి : కేంద్రాన్ని కోరిన హైకోర్టు

గృహోపకరణాలు, దుస్తులు సహా ప్రజలు ఉపయోగించే అన్ని వస్తువులపై అది శాఖాహారమో..లేదా మాంసాహారమో అని తెలిసేలా లేబుల్స్ ముద్రించాలని ఢిల్లీ హైకోర్టు కేంద్రానికి సూచించింది.

Products Vegetarian Or Non-Vegetarian :  ఏది శాకాహారమో..ఏది మాంసాహారమో వివరించాలి : కేంద్రాన్ని కోరిన హైకోర్టు

Products Vegetarian Or Non Vegetarian

delhi hc seeks centres stand on plea to label all products : గృహోపకరణాలు, దుస్తులు సహా ప్రజలు ఉపయోగించే అన్ని వస్తువులపై అది శాఖాహారమో..లేదా మాంసాహారమో అని తెలిసేలా లేబుల్స్ ముద్రించాలని ఢిల్లీ హైకోర్టు కేంద్రానికి సూచించింది. ఇంటికి సంబంధించిన వస్తువులతో పాటు బట్టలు వాటి తయారీలో వాడిన పదార్థాలను (మెటిరియల్స్) గురించి తెలిసేలా వాటిపై లేబుల్స్ ద్వారా సూచించాలని జస్టిస్ విపిన్ సంఘీ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం (నవంబర్11,2021) తెలిపింది. శాకాహారం లేదా మాంసాహారం అని ముద్రించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ ఓ సంస్థ వేసిన దావాపై దిల్లీ హైకోర్టు గురువారం కేంద్రానికి తాఖీదులు పంపింది.

Read more : Syringe crisis: 2022 నాటికి ప్రపంచవ్యాప్తంగా 200 మిలియన్ల ఇంజెక్షన్ సిరంజిల కొరత : WHO

దీనికి సంబంధించిన ఆర్డర్ కాపీని ఆరోగ్య, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖల సంబంధిత కార్యదర్శులకు వారి పరిశీలన కోసం ఇవ్వాలని మరియు మూడు వారాల్లో ప్రతిస్పందన దాఖలు చేయాలని ఆదేశించింది.ప్రతి ఒక్కరికీ తాము వాడుతున్న ఉత్పత్తి గురించి తెలుసుకొనే హక్కు ఉందనీ..తమ నమ్మకాలను అనుసరించే హక్కు ఉందని ఉందరీ..ఈ విషయాన్ని కేంద్రం తీవ్రంగా పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. గో సంరక్షణ కోసం పనిచేసే ‘రామ్‌ గౌ రక్షా దళ్‌’ అనే సంస్థ ఈ పిటీషన్ వేసింది. ఈ పిటీషన్ లో ఉత్పత్తులపై ముద్రలు లేకపోవడం వల్ల శాకాహారాన్ని పాటించేవారు తమకు తెలియకుండా మాంసాహార ఉత్పత్తులు వినియోగించాల్సి వస్తోందని పేర్కొంది.

ఈ విషయంపై పిటిషనర్ తరపు న్యాయవాది రజత్ అనీజా మాట్లాడుతు..నిత్యజీవితంలో మన అనేక వస్తువులు, సరుకులు వినియోగిస్తుంటాం. అలా మనం వాడేవి జంతువుల నుండి ఉద్భవించాయా? జంతు ఆధారిత ఉత్పత్తులను ఉపయోగించి ప్రాసెస్ తో చేయబడతాయని తెలియకుండానే వాడేస్తున్నామని..ఇది తెలియకుండా అవి శాఖాహారమో..మాంసాహారమో తెలియట్లేదని ఈ విషయాన్ని సదరు ప్రొడక్ట్ ప్రకటించకుండానే విక్రయిస్తున్నారని పిటీషన్‌లో హైలైట్ చేశారు.

Read more : Non-veg food: నాన్ వెజ్ ఫుడ్ దాచి పెట్టి అమ్మండి.. లేదంటే శిక్ష తప్పదు

తెల్ల చక్కెరను పాలిష్ చేయడానికి లేదా శుద్ధి చేయడానికి బోన్ చార్ లేదా నేచురల్ కార్బన్‌ను ఉపయోగిస్తారని, ఇది శాకాహారాన్ని వినియోగించే వ్యక్తులకు సరిపోదని Mr అనెజా కోర్టుకు తెలిపారు.అలాగే సౌందర్య సాధనాలతో పాటు, వివిధ ఆహార పదార్థాలు కూడా ఉన్నాయనీ..పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వినియోగదారులు వారు వాడే ఉత్పత్తుల గురించి వారు తెలుసుకునే హక్కు ఉందని తెలిపారు.

“పిటిషనర్ యొక్క ప్రాథమిక ప్రయత్నం ఏమిటంటే…ఒక నిర్దిష్ట ఉత్పత్తిలోని పదార్థాల స్వభావం ఆధారంగా ఉత్పత్తులను ఆకుపచ్చ, ఎరుపు,గోధుమ రంగుగా లేబులింగ్ చేయడానికి ఇప్పటికే ఉన్న నియమాలు..విధానాలను కఠినంగా అమలు చేయడమే కాకుండా, నిర్దేశించడం కోసం కూడా సంబంధిత అధికారులు ఆహార ఉత్పత్తులు, సౌందర్య సాధనాలు, పరిమళ ద్రవ్యాలు; గృహోపకరణాలు (దుస్తులు, బెల్టులు, బూట్లు మొదలైనవి) వంటి గృహోపకరణాలు, ఉపకరణాలు (నెక్లెస్‌లు, వాలెట్లు మొదలైనవి) మరియు అలాంటి ఉత్పత్తులన్నింటినీ ఒకే విధంగా లేబుల్ చేయడం తప్పనిసరి చేయడం తప్పనిసరి.” అని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై తదుపరి విచారణ డిసెంబర్ 9న జరగనుంది.