Syringe crisis: 2022 నాటికి ప్రపంచవ్యాప్తంగా 200 మిలియన్ల ఇంజెక్షన్ సిరంజిల కొరత : WHO

2022 నాటికి ప్రపంచవ్యాప్తంగా 200 మిలియన్ ఇంజెక్షన్ సిరంజిల కొరత ఉంటుందని ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది.

Syringe crisis:  2022 నాటికి ప్రపంచవ్యాప్తంగా 200 మిలియన్ల ఇంజెక్షన్ సిరంజిల కొరత : WHO

Vaccination Crisis

Shortage 200 million injection syringes by 2022 : 2022  నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఇంజెక్షన్లు సిరంజిల కొరత ఏర్పడవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరిస్తోంది. ఈకరోనా కాలంలో వ్యాక్సినేషన్ల ప్రక్రియలో భాగంగా సిరంజీల వాడకం భారీగా పెరిగింది. ఈక్రమంలో వచ్చే ఏడాదినాటికి 200 మిలియన్ ఇంజెక్షన్ సిరంజిల కొరత ఏర్పడవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ మంగళవారం విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా సిరంజిలను పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్నారని వెల్లడించింది.

కోవిడ్ వ్యాక్సినేషన్లలో భాగంగా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 725 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్ మోతాదులు ఇచ్చారు. సింగిల్, డబుల్, బూస్టర్ డోస్‌లు కలిపి ఉన్నాయి. ఈ టీకా మొత్తం ఒక సంవత్సరంలో ఇచ్చిన మొత్తం టీకాల కంటే రెండింతలు ఎక్కువ. ప్రతి మోతాదుకు ప్రత్యేక సిరంజి ఉపయోగించాల్సిందే. ఇది భద్రత కోసం తప్పనిసరి. కాబట్టి సిరంజి వినియోగం కూడా ప్రతి సంవత్సరం రెట్టింపుగా మారింది.

Read more : PM Jacinda livestrm : లైవ్ లో మాట్లాడుతున్నన్యూజిలాండ్ ప్రధాని జెసిండా..‘మమ్మీ’అంటూ వచ్చిన కూతురు..ఇంట్రెస్టింగ్ సీన్

ఈ విషయంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మెడిసిన్స్, హెల్త్ ప్రొడక్ట్‌లకు యాక్సెస్ విభాగానికి చెందిన సీనియర్ సలహాదారు లిసా హెడ్‌మాన్..మాట్లాడుతూ,“వచ్చే సంవత్సరం వరకు టీకాలు వేయడానికి సిరంజిల లభ్యత లేకపోవడం ఆందోళన కలిగించే విషయం అని తెలిపారు. ఈకొరత వ్యాక్సినేషన్ వేగాన్ని తగ్గించే అవకాశముంది. ఇది మంచిది. కాదు వ్యాక్సినేషన్ కొనసాగితేనే కరోనాను కట్టడి చేయగలం. అలాగే అనేక వ్యాధుల నుండి ప్రజలను రక్షించే ప్రయత్నాలపై కూడా ఇది తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది.” అని తెలిపారు.

దీంతో ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న డబ్ల్యూహెచ్ఓ సిరంజిలు ఉత్పత్తి పెంచాల్సిన అవసరం ఉందని సిఫారసు చేసింది. అలాగే సిరంజిల సరఫరా తగ్గితే..ప్రపంచ స్థాయిలో భయాందోళనలు తలెత్తుతాయని ఇది సరైందికాదని తెలిపింది. వ్యాక్సిన్లు, సిరంజిల సరఫరా కూడా ఉత్పత్తి, వాటిని వినియోగ స్థలంలో దూరంపై కూడా ఆధారపడి ఉంటుందని అన్నది. అవసరాల కొరత ఉంటుందనే విషయం కలవరానికి గురిచేస్తోందని..సిరంజిల విషయానికొస్తే..ఈ కొరత 100 నుండి 200 కోట్ల వరకు ఉంటుందని వెల్లడించింది. కాబట్టి సరైన సమయంలో సిరింజిల ఉత్పత్తి పెంచాలని పక్కా ప్లాన్ తో ముందస్తుగానే సిరంజిల ఉత్పత్తి పెంచాలని హెచ్చరిస్తోంది.

Read more : Pandemic is Returning : జ‌ర్మ‌నీలో కరోనా విజృంభణ.. 24 గంటల్లో కొత్త‌గా 50వేల కేసులు..

కాగా వ్యాక్సిన్ వచ్చి దాదాపు సంవత్సరం కావస్తోంది. ఈక్రమంలో ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. దీనికి తగినట్లుగా టీకా తయారీ కంపెనీలు తమ ఉత్పత్తిని మరింత వేగం చేశాయి. వ్యాక్సినేషన్ వేగం పెరిగేకొద్దీ ఇప్పటి వరకు నిల్వ ఉన్న సిరంజీల సంఖ్య భారీగానే తగ్గిపోతోంది. ఈ క్రమంలో ఇప్పటివరకూ అందుతున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న వివరాల ప్రకారంగా చూసుకుంటే మరో నెలరోజుల టీకా ఉత్పత్తికి అవసరమైన సిరెంజిలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. సిరెంజి తయారీ కంపెనీలు తక్కువగా ఉండటం.. వ్యాక్సిన్ కోసం నాణ్యమైన సిరెంజి వాడకానికి సిద్ధం చేయడం లేట్ అవుతోంది. దీంతో.. వచ్చే 2022 సంవత్సరంలో వ్యాక్సిన్ కోసమే కాకుండా సాధారణ ఇంజెక్షన్లు చేయటానికి కూడా అవసరమయ్యే ఉపయోగం కోసం కూడా సిరెంజిల కొరత ఎదురయ్యే అవకాశం ఉందని డబ్ల్యు హేచ్వో అంచనా వేస్తు హెచ్చరిస్తోంది.