తెలంగాణ ఎన్నికల కమిషన్‌కు హైకోర్టు షాక్.. పెన్నుతో మార్క్ చేస్తే ఓటు చెల్లదు..

  • Published By: bheemraj ,Published On : December 4, 2020 / 10:24 AM IST
తెలంగాణ ఎన్నికల కమిషన్‌కు హైకోర్టు షాక్.. పెన్నుతో మార్క్ చేస్తే ఓటు చెల్లదు..

High Court verdict BJP House Motion Petition : తెలంగాణ ఎన్నికల కమిషన్ కు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. బ్యాలెట్ పేపర్ పై స్వస్తిక్ గుర్తును మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించింది. ఎన్నికల సంఘం నిన్న రాత్రి జారీ చేసిన సర్క్యులర్ చెల్లదని తెలిపింది. పెన్నుతో మార్క్ చేస్తే ఓటు చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది.



బీజేపీ హౌస్ మోషన్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ మేరకు తీర్పును ఇచ్చింది. బీజేపీ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్ట్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులను తోసిపుచ్చింది.



బ్యాలెట్ పేపర్ పై స్వస్తిక్ ముద్రతో పాటు ఏ గుర్తు ఉన్నా ఓటుగా పరిగణించాలని ఈసీ ఉత్తర్వులు జారీ చేయగా.. బ్యాలెట్ పేపర్‌పై పెన్నుతో మార్క్ చేసిన ఓట్లను కూడా పరిగణలోకి తీసుకోవాలని ఉత్తర్వలో ఉంది. ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయంపై బీజేపీ మండిపడింది.



ఈసీ ఉత్తర్వులను సవాల్ చేస్తూ బీజేపీ శుక్రవారం హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈసీ సర్క్యులర్ చెల్లదన్న హైకోర్టు ఆదేశంపై బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు.