Gas Problem : గ్యాస్ సమస్యకు చెక్ పేట్టే ఇంటి చిట్కాలు!

ఒక కప్పు మరిగించిన నీటిలో ఒక టేబుల్‌స్పూన్‌ సోంపు వేసి మూత పెట్టి రాత్రంతా అలాగే ఉండనివ్వండి. ఉదయాన్నే వడకట్టిన ఆ నీటిలో ఒక టేబుల్‌స్పూను తేనె కలుపుకుని తాగండి.

Gas Problem : గ్యాస్ సమస్యకు చెక్ పేట్టే ఇంటి చిట్కాలు!

Gas Problem

Gas Problem : జీవనశైలి, తినే ఆహారంలో మార్పుల కారణంగా చాలా మంది దైనందిన జీవితంలో గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారు. దీని కారణంగా రోజువారి పనులు సరిగా నిర్వర్తించలేని పరిస్ధితి ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో గ్యాస్ సమస్య కారణంగా పడే ఇబ్బంది అంతా ఇంతా కాదు. సమస్య నుండి బయటపడేందుకు వివిధ రకాల పద్దతులను అనుసరిస్తుంటారు. అయితే ఇంట్లో లభించే కొన్ని రకాల పదార్ధాలతోనే గ్యాస్ సమస్యకు శులభంగా చెక్ పెట్టవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

గ్యాస్ సమస్యకు తాత్కాలిక ఉపశమనానికి నిమ్మరసం ఎంతో మేలు చేస్తుంది. ఒక కప్పు నీటిలో కొంచెం నిమ్మరసం కలిపి ఉదయాన్నే తీసుకుంటే చాలా మంచిది. గ్యాస్ సమస్యను పొగొట్టేందుకు కొబ్బరి నీళ్లు బాగా ఉపకరిస్తాయి. రోజు కొబ్బరి నీళ్లను తాగటం అలవాటు చేసుకుంటే గ్యాస్ నుండి ఉపశమనం పొందవచ్చు. గ్యాస్ సమస్యకు ముఖ్యకారణం తిన్నది జీర్ణం కాకపోవటమే. తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమయ్యేందుకు అల్లంను ఆహారంలో బాగం చేసుకుంటే మంచిది. రోజూ ఉదయాన్నే పరగడుపున రెండు టీస్పూన్ల అల్లం రసం తీసుకోవాలి.

ఒక కప్పు మరిగించిన నీటిలో ఒక టేబుల్‌స్పూన్‌ సోంపు వేసి మూత పెట్టి రాత్రంతా అలాగే ఉండనివ్వండి. ఉదయాన్నే వడకట్టిన ఆ నీటిలో ఒక టేబుల్‌స్పూను తేనె కలుపుకుని తాగండి. ఇలా రోజుకు మూడుపూటలా తాగితే ఎసిడిటీ నుండి ఉపశమనం దొరుకుతుంది. గ్యాస్ సమస్యకు మజ్జిగ మంచి మేలు చేస్తుంది. మజ్జిగలోని లాక్టిక్‌ ఆసిడ్‌ కడుపులోని గ్యాస్‌కు కల్లెం వేస్తుంది. మసాలా దినుసులతో చేసిన ఆహారం తిన్నప్పుడు మజ్జిగ తీసుకోవడం మంచిది. చల్లార్చిన గ్లాసు పాలలోకి ఒక స్పూను తేనె కలుపుకుని తాగటం వల్ల గ్యాస్ సమస్య నుండి బయటపడవచ్చు. తులసి ఆకుల్ని వేడి నీటిలో వేసి మరిగించాలి. ఆ నీటిని చల్లారిన తరువాత సేవించాలి. ఇలా పదిరోజులు చేస్తే గ్యాస్ నుండి ఉపశమనం కలుగుతుంది.