12 మంది ప్రాణాలు కాపాడిన ఫోన్‌ కాల్‌..ఉత్తరాఖండ్ ఉత్పాతంలో జరిగిన అద్భుతం..!!

12 మంది ప్రాణాలు కాపాడిన ఫోన్‌ కాల్‌..ఉత్తరాఖండ్ ఉత్పాతంలో జరిగిన అద్భుతం..!!

How A Phone Call Saved 12 In Uttarakhand : ఒక్క ఫోన్ కాల్..ఒకే ఒక్క ఫోన్ కాల్ 12మంది ప్రాణాలు కాపాడింది. ఉత్తారాఖండ్ లో జరిగిన పెను ప్రమాదంలో ఇక తాము కూడా జలసమాధి అయిపోతామనుకునే సయమంలో ఓ వ్యక్తి దగ్గర ఉన్న ఫోన్ సిగ్నల్ అందటంతో అప్పటి వరకూ తమ ప్రాణాలమీద ఆశలు వదిలేసుకున్న సమయంలో ఒక్క ఫోన్ కాల్ 12మంది ప్రాణాల్ని కాపాడింది. ఉత్తరాఖండ్ లో హిమనీనదం సృష్టించిన ఉత్పాతం అంతా ఇంతా కాదు 200ల మందికి పైగా ప్రాణాల్ని గాల్లో కలిపేసింది. ప్రకృతి కన్నెర్ర చేస్తే ఎలా ఉంటుందో ఊహించేసరికే జరగాల్సిన అనర్థం జరిగిపోయింది..!

ధౌలిగంగా నది ఉగ్రరూపం ఉత్తరాఖండ్‌ ప్రజలను తీవ్ర విషాదంలో ముంచెత్తిన సంగతి దేశం యావత్తును ఉలిక్కిపడేలా చేసింది. ఆకస్మత్తుగా సంభవించిన ఈ విలయంలో 200ల మంది వరకు గల్లైంతైనట్లు సమాచారం. ఇంతటి విషాదంలో ఒకే ఒక్క ఫోన్‌ కాల్‌ 12 మంది ప్రాణాలు కాపాడింది.

మంచు చరియలు విరిగిపడటంతో ఉప్పొంగిన ధౌలీనది ఉగ్ర రూపం దాల్చింది. ఆ పరిశసరాల్లో ఉన్న ఇళ్లు దాదాపు ఆ నదీ ఉగ్రరూపానికి బలైపోయాయి. నీటితో చిన్న పడవల్లా కొట్టుకుపోయాయి. ఇదే సమయం‍లో రాష్ట్రంలోని చమేలి తపోవన్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ వర్కర్లు 12 మంది ఓ అండర్‌గ్రౌండ్‌ టన్నెల్‌లో విధులు నిర్వహిస్తున్నారు.

ప్రమాదం గురించి తెలిసిన వెంటనే అధికారులు ఆ చుట్టుపక్కల ఉన్న వారిని ప్రమాదం గురించి..బయటకు రావాలని పిలుపునిచ్చారు. ఆ పిలుపు విన్న వర్కర్లు టన్నెల్‌ నుంచి బయటకు రావాలని ప్రయత్నించారు. కానీ ఈ లోపే వరద నీరు టన్నెల్‌లోకి అత్యంత వేగంగా దూసుకువచ్చింది. అంతేకాక వారు బయటకు వచ్చే అవకాశం లేకుండా ప్రవేశ మార్గాన్ని బురద మొత్తం కప్పేసింది. దీంతో ఇక తమ ప్రాణాలమీద ఆశలు వదిలేసుకున్నారా కార్మికులు.

టన్నెల్‌ నుంచి బయటపడే మార్గం లేకపోవడం.. బయట ఉన్న బురద వల్ల లోపల ఉన్న తమ గురించి అధికారులకు తెలిసే అవకాశం ఉండదని అనుకున్నాడు. ఇక తమ పని అయిపోయినట్లే ఈ టెన్నెల్ లోనే సజీవ సమాధి అయిపోవాల్సిందేనని..అనుకున్నారు. ఆ 12 మంది వర్కర్లు జీవితం మీద ఆశ వదిలేసుకున్నారు. కానీ అప్పుడే జరిగిందో అద్భుతం..!!

అక్కడే ఉన్న ఓ కార్మికుడి మొబైల్‌ కు సిగ్నల్ అందింది. దీంతో వారి ఆశలు చిగురించాయి. ప్రాణాలు తిరిగి వచ్చినట్లైంది. అతడి ఫోన్‌కి సిగ్నల్‌ అందడంతో వెంటనే కంపెనీకి కాల్‌ చేసి తమ పరిస్థితిని చెప్పారు. వెంటనే మమ్మల్ని కాపాడాలని కోరారు. దీంతో సదరు కంపెనీ వెంటనే అప్రమత్తమైంది. కంపెనీ జీఎం ఐటీబీపీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటీన వారు టన్నెల్‌ వద్దకు చేరుకుని బురద మొత్తం తొలగించి..12 వర్కర్లను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఆ తర్వాత వీరందరిని ఐటీబీపీ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.

తాము సురక్షితంగా బైటపడ్డామనే విషయాన్ని వారింకా జీర్ణించుకోలేకపోతున్నారు. చావు కళ్లముందు కనిపిస్తే ఎలా ఉంటుందో వాళ్లు స్వయంగా అనుభవించారు. ఇక తమ ప్రాణాలు ఈ టెన్నెల్ లోనే సమాధి అయిపోతాయనే సమయంలో ఒక్క ఫోన్ కాల్ వారి పాలిన సాక్షాత్తూ భగవంతుడిగా మారింది. 12మంది ప్రాణాల్ని కాపాడింది.