Microsoft Free Trick : ఈ ట్రిక్‌తో MS Office సాఫ్ట్‌వేర్ ఉచితంగా యాక్సస్ చేసుకోవచ్చు.. ఇదిగో ప్రాసెస్..!

ప్రతి యూజర్ కంప్యూటర్‌లో మైక్రోసాఫ్ట్ ఆఫీసు (Microsoft Office) కామన్.. ఎంఎస్ ఆఫీసు అనగానే అందరికి ముందుగా గుర్తుచ్చేది... MS Word, MS Excel, MS Power Point సాఫ్ట్ వేర్ టూల్స్..

Microsoft Free Trick : ఈ ట్రిక్‌తో MS Office సాఫ్ట్‌వేర్ ఉచితంగా యాక్సస్ చేసుకోవచ్చు.. ఇదిగో ప్రాసెస్..!

How To Get Microsoft Word, Excel And Powerpoint For Free

Microsoft Offer : ప్రతి యూజర్ కంప్యూటర్‌లో మైక్రోసాఫ్ట్ ఆఫీసు (Microsoft Office) కామన్.. ఎంఎస్ ఆఫీసు అనగానే అందరికి ముందుగా గుర్తుచ్చేది… MS Word, MS Excel, MS Power Point సాఫ్ట్ వేర్ టూల్స్.. ఈ టూల్స్ లేకుండా దాదాపు ఏ కంప్యూటర్ ఉండదనే చెప్పాలి. డేటా ఎంట్రీ దగ్గర నుంచి డాక్యుమెంట్ల రెడీ చేసుకోవాలంటే తప్పనిసరిగా ఎంస్ వర్డ్ ఉండాల్సిందే. అలాగే స్ప్రెడ్ షీట్ క్రియేట్ చేసుకోవాలంటే కూడా ఎక్సెల్ ఉండాలి. ప్రజెంటేషన్ కోసం చూస్తుంటే.. స్లైడ్స్ డిజైన్ కోసం పవర్ పాయింట్ తప్పనిసరిగా కావాల్సిందే మరి. ఇవన్నీ ఎంఎస్ ఆఫీసు సాఫ్ట్ వేర్ లోనే ఉంటాయి.

వాస్తవానికి ఈ MS Office Software ఫ్రీగా దొరకదు. ఒరిజినల్ సాఫ్ట్ వేర్ కొనాలంటే వేలల్లో ఉంటుంది. అన్ని వేలు పోసి సాఫ్ట్ వేరు కొనడం కష్టమే. కొన్నిచోట్ల ఎంఎస్ ఆఫీసు పైరసీ సాఫ్ట్ వేర్ అమ్ముతుంటారు. ఇలాంటివి కొనకపోవడమే మేలు.. ఎందుకంటే అందులో వైరస్ ఉండొచ్చు. మీ కంప్యూటర్ లో వైరస్ చేరితో ఇక అంతే సంగతలు.. మరి.. ఈ MS Office ఉచితంగా సెక్యూర్ కలిగిన సాఫ్ట్ వేర్ వినియోగించుకోలేమా అంటే.. దానికో ట్రిక్ ఉంది. ఇలా చేస్తే చాలు.. మైక్రోసాఫ్ట్ కంపెనీనే మీకు ఉచితంగా MS Office సాఫ్ట్ వేర్ ఆఫర్ చేస్తోంది. అది కూడా యాక్సస్ మాత్రమే అందిస్తుంది.

మీరు చేయాల్సిందిల్లా ఒకటే.. స్టూడెంట్ లేదా టీచర్ గానీ ఫ్యాకల్టీ మెంబర్ అయి ఉండాలి. ఇందులో ఏదో ఒక పేరుతో మీరు మైక్రోసాఫ్ట్ వెబ్ సైట్లో రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. కాకపోతే ఇక్కడ మీరు ఇన్‌స్టిట్యూట్‌కు సంబంధించిన వెరిఫైడ్ ఈమెయిల్‌తో మాత్రమే లాగిన్ కావాల్సి ఉంటుంది. మైక్రోసాఫ్ట్ వెబ్‌సైట్‌లో స్టూడెంట్ ఈమెయిల్ అడ్ర‌స్‌ ద్వారా లాగిన్ అయి రిజిస్ట‌ర్ చేసుకోవచ్చు. అప్పుడు మైక్రోసాఫ్ట్ కంపెనీ మీకు MS Office Student Package ఉచితంగా అందిస్తుంది. ఆఫీస్ 365 (Office 365) ద్వారా Log in అవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా MS Office Suite కూడా యాక్సెస్ చేసుకోవ‌చ్చు. అందులో కూడా Word, Excel, Powerpoint, OutLook, Microsoft Teams, One Drive, SharePoint సాఫ్ట్ వేర్లను కూడా ఈజీగా, ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే స్టూడెంట్ గా రిజిస్టర్ అయిపోండి.. మైక్రోసాఫ్ట్ ఆఫీసు సాఫ్ట్ వేర్ ఉచితంగా యాక్సస్ చేసుకోండి.

Read Also : Omicron Name : కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్‌’ పేరు వెనుక..చైనా అధ్యక్షుడు పేరులో ‘ Xi ’కథాకమామీషు..