Gladiator 2 : గ్లాడియేటర్‌ సెట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ఇంతటి ప్రమాదం ఎప్పుడు చూడలేదంటున నిర్మాత!

5 ఆస్కార్ అవార్డ్స్ అందుకున్న గ్లాడియేటర్‌ మూవీకి 23 ఏళ్ల తర్వాత సీక్వెల్ రాబోతుంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ సెట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.

Gladiator 2 : గ్లాడియేటర్‌ సెట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ఇంతటి ప్రమాదం ఎప్పుడు చూడలేదంటున నిర్మాత!

Huge fire accident takes place in Gladiator 2 shooting sets

Updated On : June 11, 2023 / 6:08 PM IST

Gladiator 2 : హిస్టారికల్ వార్ డ్రామా కథాంశంతో ఆడియన్స్ ముందుకు వచ్చి హిస్టారిక్ హిట్టుని సొంతం చేసుకున్న చిత్రం గ్లాడియేటర్‌. ప్రపంచంలోని ప్రతి మూవీ మేకర్ నుంచి సినిమాలను అమితంగా ఇష్టపడే వాళ్ళ వరకు ఈ చిత్రాన్ని కచ్చితంగా చూసి ఉండే ఉంటారు. 2000 లో రిలీజ్ అయిన ఈ సినిమా అప్పటిలో ఒక సంచలనం. సర్ రిడ్లీ స్కాట్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించడమే కాకుండా ఎన్నో అవార్డులను కూడా తెచ్చిపెట్టింది.

Kriti Sanon : అతను నాతో అసభ్యంగా ప్రవర్తించాడు.. అమ్మకి ఫోన్ చేసి ఏడ్చేశాను.. కృతి సనన్!

ప్రపంచ సినీ తారలు అంతా ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ (Oscar) అవార్డ్స్ లో ఏకంగా 5 అవార్డులు సొంతం చేసుకుంది. ఇక ఇంతటి బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమాకి సీక్వెల్ తీసుకు వస్తే బాగుంటాదని ఎంతోమంది ఫీల్ అయ్యి ఉంటారు. ఇక ఇప్పుడు 23 ఏళ్ల తర్వాత గ్లాడియేటర్‌ 2 ని రూపొందిస్తున్నారు మేకర్స్. అయితే ఇది సీక్వెల్ కాదు ప్రీక్వెల్ అని తెలుస్తుంది. ఇక ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. పారామౌంట్ పిక్చర్స్ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది నవంబర్ ల ఈ సినిమా విడుదల కానుంది.

Adipurush : ఆ థియేటర్స్‌లో ఆదిపురుష్ నో రిలీజ్.. కలెక్షన్స్‌కి దెబ్బ పడనుందా..?

కాగా ప్రస్తుతం మొరాకోలో జరుగుతున్న ఈ మూవీ సెట్స్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చిత్ర యూనిట్ కి చెందిన 6 వ్యక్తిలకు తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ విషయం గురించి చిత్రం నిర్మాత మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఇంతటి ప్రమాదం ఎప్పుడు చూడలేదని చెప్పుకొచ్చాడు. గాయపడిన వారిలో 2 పూర్తిగా కోలుకున్నారని, మరో 4కి చికిత్స కొనసాగుతోందని, వారి ఆరోగ్యం కూడా నిలకడగానే ఉందని చెప్పుకొచ్చారు.