Huge Sets : అవుట్ డోర్ వద్దు.. ఇండోర్ ముద్దు.. భారీ సెట్స్ కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న నిర్మాతలు..

కరోనా సెకండ్ వేవ్‌తో మళ్లీ సినిమా వాళ్లకు కష్టాలు మొదలయ్యాయి. షూటింగ్స్ క్యాన్సిల్ చెయ్యలేక, షెడ్యూల్స్ పోస్ట్ పోన్ చేసే ఛాన్స్ లేక, రియల్ లొకేషన్స్‌కి వెళ్లే రిస్క్ చెయ్యలేక.. కోట్లకు కోట్లు పెట్టి స్టూడియోల్లోనే సెట్స్ వేసుకుంటున్నారు..

Huge Sets : అవుట్ డోర్ వద్దు.. ఇండోర్ ముద్దు..  భారీ సెట్స్ కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న నిర్మాతలు..

Huge Sets

Huge Sets: కరోనా సెకండ్ వేవ్‌తో మళ్లీ సినిమా వాళ్లకు కష్టాలు మొదలయ్యాయి. షూటింగ్స్ క్యాన్సిల్ చెయ్యలేక, షెడ్యూల్స్ పోస్ట్ పోన్ చేసే ఛాన్స్ లేక, రియల్ లొకేషన్స్‌కి వెళ్లే రిస్క్ చెయ్యలేక.. కోట్లకు కోట్లు పెట్టి స్టూడియోల్లోనే సెట్స్ వేసుకుంటున్నారు.

కరోనాతో లొకేషన్స్‌లో షూటింగ్ చెయ్యడం రిస్క్ అనుకుంటున్నారు మేకర్స్. అందుకే సెట్స్ వేసుకోవడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బన్నీ-సుకుమార్ హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కుతున్న ‘పుష్ప’ సినిమా సెట్స్‌నే ప్రిఫర్ చేస్తోంది. ఆల్రెడీ కరోనాతో ఈ సినిమాకు సంబందించి షూటింగ్ ఇప్పటికే చాలా లేట్ అయ్యింది. అయితే ఆగస్ట్ 13న రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన ‘పుష్ప’ అనుకున్న టైమ్‌కి సినిమా కంప్లీట్ చెయ్యడానికి జెట్ స్పీడ్‌లో షూటింగ్ చేస్తోంది. దీనికి సంబందించి బడ్జెట్ ఎక్కువైనా రెడీయే అంటున్నారు మేకర్స్.

Pushpa

‘పుష్ప’ కంప్లీట్ చెయ్యడానికి రియల్ లొకేషన్స్ కాకుండా కరోనాని దృష్టిలో పెట్టుకుని కొంత పార్ట్ సెట్స్‌లోనే కంటిన్యూ చేద్దామని డిసైడ్ అయ్యింది టీమ్. అంతకు ముందే మారేడుమిల్లి అడవుల సెట్ వేసిన ‘పుష్ప’ టీమ్ ఇప్పుడు క్లైమాక్స్ సీన్స్ కోసం కూడా కొన్ని సెట్స్‌లోనే కంప్లీట్ చేద్దామనుకున్నారట. అందుకే క్లైమాక్స్ సీన్స్‌కి దాదాపు 40 కోట్లు స్పెండ్ చేస్తున్నారు నిర్మాతలు..

వరుస సినిమాలతో ఫుల్ స్పీడ్ మీదున్న నేచురల్ స్టార్ నాని కూడా సెట్స్‌లోనే షూటింగ్ చెయ్యబోతున్నారు. నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా తెరకెక్కుతున్న ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమాని కూడా సెట్స్‌లోనే చెయ్యబోతున్నారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘శ్యామ్ సింగ రాయ్’ షూటింగ్ ప్రస్తుతం శంకర పల్లి cbit పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఇప్పటివరకూ కోల్ కతాలో షూటింగ్ జరిపిన టీమ్, కోవిడ్ ఎక్కువవడంతో యూనిట్‌ని రిస్క్‌లో పెట్టడం ఎందుకని, పదెకరాల స్థలంలో దాదాపు ఆరున్నర కోట్లతో కోల్‌కతా సెట్ వేస్తున్నారు ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా..

Shyam Singha roy