Hike soap,detergent prices : సబ్బులు, డిటర్జెంట్ల ధరలు పెంచేసిన HUL, ITC కంపెనీలు..

ఇప్పటికే పెరిగిన..పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో అన్ని నిత్యావసర వస్తువులు పెరిగాయి. ఇక బట్టల వాషింగ్ కూడా భారం కానుంది. సబ్బులు, డిటర్జెంట్ల ధరలు పెంచేశాయి HUL, ITC కంపెనీలు.

10TV Telugu News

HUL and ITC hike soap and detergent prices : ఇప్పటికే పెరిగిన..పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో అన్ని నిత్యావసర వస్తువులు పెరుగుతున్నాయి. మరోపక్క ఉల్లి, టమాటాలు. మరోపక్క వంటనూనెల ధరలు జనాల్ని బెంబేలెత్తిస్తున్నాయి. ఈ క్రమంలో మేమేమన్నా తక్కువ తిన్నామా? అంటూ సబ్బులు, డిటర్జెంట్ల ధరలు కూడా పెరిగిపోయాయి. సబ్బులు, డిటర్జెంట్ల తయారు చేసే సంస్థలు వీటి ధరల్ని పెంచేశాయి. HUL, ITC కంపెనీలు సబ్బులు, డిటర్జెంట్ల ధరలు పెంచేశాయి. ఈ పెరిగిన ధరలు వినియోగదారులపై మరింత భారంగా మారనున్నాయి. కానీ సదరు కంపెనీలు మాత్రం వినియోగదారులపై పెరిగిన భారాన్ని పెద్దగా మోపం అంటున్నాయి. కానీ అన్నింటి ధరలు పెరుగుతున్న క్రమంలో సామాన్యులకు ఈ పెరుగుదల భారమే అవుతోంది.

Read more : Cm Stalin : టమాటా ధరల కట్టడికి సీఎం స్టాలిన్ కీలక నిర్ణయం..మార్కెట్ లో దిగివచ్చిన ధరలు

దీంట్లో భాగంగా HUL, ITC కంపెనీలు సామాన్యుల నెత్తిన ఇప్పుడు మరో బాంబు వేశాయి. సబ్బులు, డిటర్జెంట్లతో పాటు సదరు కంపెనీలకు సంబంధించి ఎంపిక చేసిన ఇతర వస్తువుల ధరలను పెంచేసింది. ఈ విషయాన్ని ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీ హిందూస్థాన్ యూనిలివర్ (హెచ్‌యూఎల్), ఐటీసీ తెలిపాయి. ఉత్పిత్తి ఖర్చులు పెరగడంతోనే ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని తెలిపాయి. కానీ పెంచిన ఈ మొత్తం భారాన్ని వినియోగదారులపై మోపడం లేదని చెబుతున్నాయి.

Read more : India : తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు, హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ఎంతంటే

పెరిగిన ధరలు ఇలా..
హెచ్‌యూఎల్ తాజా ధరల నిర్ణయంతో కిలో వీల్ డిటర్జెంట్ పౌడర్ (wheel detergent powder)ధర 3.4 శాతం అంటే రూ. 2 పెరిగింది. అదే అరకిలో వీల్ పౌడర్ ప్యాక్‌పై రూ. 2 పెంచి రూ.30 చేసింది. 250 గ్రాముల రిన్‌బార్‌ ధరను 5.8 శాతం పెంచింది. 100 గ్రాముల మల్టీప్యాక్ లక్స్ సబ్బు ధరను 21.7 శాతం (రూ. 25) పెంచింది. 100 గ్రాముల ఫియామా డి విల్స్ సబ్బు ధరను ఐటీసీ 10 శాతం పెంచింది. వివెల్ సబ్బు ప్యాక్‌ ధర 9 శాతం పెరిగింది. 150 మిల్లీలీటర్ల ఎంగేజ్ డియోడరెంట్ ధర 7.6 శాతం, 120 మిల్లీలీటర్ల బాటిల్ ధరపై రూ. 7.1 శాతం పెరిగింది.