Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీకి బిగ్ షాక్.. మరో కేసు నమోదు
Vallabhaneni Vamsi : వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో కేసు నమోదైంది. మాచవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
Vallabhaneni Vamsi
Vallabhaneni Vamsi : వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై మరో కేసు నమోదైంది. విజయవాడలోని మాచవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సునీల్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై వంశీపై పోలీసులు కేసు నమోదు చేశారు.
2024 జులై నెలలో తనపై వంశీ, ఆయన అనుచరులు దాడికి పాల్పడినట్లు ఫిర్యాదు చేశారు. వంశీ సహా మరో ఎనిమిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోంది.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వల్లభనేని వంశీపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. గతంలో ఓ టీడీపీ కార్యకర్త కిడ్నాప్, బెదిరింపుల కేసులో ఈ ఏడాది ఫిబ్రవరి 16న అరెస్ట్ అయ్యారు. ఆ తరువాత ఆయనపై వరుసగా కేసులు నమోదయ్యాయి.
వల్లభనేని వంశీ ఇప్పటికే 11 కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. పలు కేసుల్లో జైలుకు వెళ్లిన వంశీ.. బెయిల్ పై విడుదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వంశీపై మరో కేసు నమోదు కావటం ఆయన వర్గీయుల్లో ఆందోళన వ్యక్తమవుతుండగా.. రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
