Viveka Case : వివేకా హత్య కేసు.. సీబీఐ కోర్టు సంచలన తీర్పు.. జగన్, భారతికి భారీ ఊరట
Viveka Case : వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. వివేకా హత్య కేసును మళ్లీ దర్యాప్తు చేయాలన్న సునీత పిటిషన్ పై
Viveka murder case
Viveka murder case: వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. వివేకా హత్య కేసును మళ్లీ దర్యాప్తు చేయాలన్న సునీత పిటిషన్ పై సీబీఐ కోర్టు విచారణ జరిపింది. ఆర్డర్ కాపీలో సీబీఐ కోర్టు కీలక అంశాలు ప్రస్తావించింది. వివేకా మరణించిన తరువాత అతని సమీప బంధువులకు విషయం తెలియజేయడం సహజం అని సీబీఐ కోర్టు అభిప్రాయ పడింది.
Also Read: Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీకి బిగ్ షాక్.. మరో కేసు నమోదు
వివేకా హత్య విషయాన్ని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ భారతికి చెప్పడంలో తప్పులేదు. వైఎస్ రాజారెడ్డికి, చిన్న కొండారెడ్డికి ఏదో చిన్నచిన్న ఆస్తి తగాదాలు ఉన్నంత మాత్రాన సాక్ష్యాలు లేకుండా ఆరోపణలు చేయడాన్ని స్వాగతించలమేిన సీబీఐ కోర్టు పేర్కొంది.
జగన్ మోహన్ రెడ్డికి, వివేకానంద రెడ్డికి మధ్య విబేధాలు ఉన్నాయని సునీత తరపు న్యాయవాది సమర్పించిన వాదనలకు ఆధారాలు లేవని సీబీఐ కోర్టు పేర్కొంది. చార్జిషీట్ ఇప్పటికే సమర్పించారు. అందులో ఎక్కడా వైఎస్ జగన్ మోహర్ రెడ్డి ప్రస్తావన లేదు. హత్య జరిగిన రోజు ఉదయం 5.30 గంటలకు జగన్ మోహన్ రెడ్డి ఫోన్ కాల్ స్వీకరించిన విషయమై మరింత దర్యాప్తు అవసరం లేదని సీబీఐ కోర్టు స్పష్టం చేసింది.
కిరణ్ యాదవ్, వైఎస్ ప్రకాశ్ రెడ్డి మనుమడైన అర్జున్ రెడ్డి మధ్య వివేకా హత్య జరిగిన రోజు మెస్సేజ్ లపై మాత్రమే దర్యాప్తు చేయండి అని సీబీఐ కోర్టు ఆదేశించింది.
