Hyper Aadi: పంచ్ లు ఒకే కానీ.. కాంట్రవర్సీల తిప్పలు తప్పట్లే!

Hyper Aadi: పంచ్ లు ఒకే కానీ.. కాంట్రవర్సీల తిప్పలు తప్పట్లే!

Hyper Aadi Controversial Comments On Anchor Varsha

Hyper Aadi: డబుల్ మీనింగ్ డైలుగులే అననీ.. వల్గారిటీ పెరిగిపోతుందనని.. ఇప్పుడు తెలుగు టీవీ షోస్ కామెడీ బాట పట్టాయి. అంతకు ముందు ఏదో పండగకో పబ్బానికో ఈవెంట్స్ ప్రసారం చేసే ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ ఇప్పుడు ఏకంగా రోజు వారీ కామెడీ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసుకుంటున్నాయి. దీంతో కమెడియన్స్ కు ఉపాధి దొరుకుతుంది. వీరిలో కొందరు బుల్లితెర స్టార్ కమెడియన్స్ గా మారిపోయారు. వారిలో హైపర్ ఆది ఒకరు. సహజంగా తన స్కిట్స్ తానే రాసుకొనే ఆది కొన్ని షోస్ కూడా రాసుకుంటూ బాగానే వెనకేసుకుంటున్నాడు. ఆది పంచ్ డైలాగులకు బుల్లితెర ప్రేక్షకులు కూడా అభిమానులుగా మారిపోయారు.

అంతవరకు బాగానే ఉన్నా అప్పుడప్పుడు ఆదికి కాంట్రవర్సీలు తప్పట్లేదు. నిజానికి మిగతా వారి స్కిట్స్ తో పోల్చితే ఆది స్కిట్స్ కాస్త వల్గారిటీకి దూరంగా ఉంటాయి. కేవలం ప్రాసలు, పంచ్ లతోనే తన స్కిట్స్ నెట్టుకొచ్చేస్తాడు. కానీ ఒక్కోసారి ఆ పంచ్ డైలాగులలోనే కాంట్రవర్సీటీలు పుట్టుకొచ్చేస్తుంటాయి. అలాంటిదే ఒకటి ఇప్పుడు ఇటు సోషల్ మీడియాలో దుమారం రేగుతుంది. రివర్స్ లో ఆది మీదనే నెటిజన్లు పంచ్ లు వేస్తున్నారు. ఆడవారిని ఆది బాడీ షేమింగ్ ఎక్కువగా చేస్తున్నాడని మండిపడుతున్నారు.

ఇంతకీ అసలు ఏమైందంటే.. ఓ షోలో పాల్గొన్న హైపర్‌ ఆది.. యాంకర్‌ వర్షపై సెటైర్లు వేశాడు. వర్షా ఎలా ఉన్నావు అని ఆది అడగ్గా.. బావున్నానండీ.. ఎందుకంటే నా పని నేను చూసుకుంటాను కాబట్టి అని వర్ష సమాధానం చెప్పింది. దీనికి కౌంటర్‌గా ఆది ‘అదే పనిగా నీకు వచ్చే కామెంట్లు కూడా చూసుకోకపోయావా.. షోలో కొత్తగా వచ్చిన లేడీ గెటప్‌ ఎవరు అని చాలామంది అడుగుతున్నారు’ అని లేడీ గెటప్ వేసిన మగాడిలా ఉన్నావంటూ వర్షపై బాడీషేమింగ్‌ కౌంటర్లు వేశాడు. దీంతో సోషల్ మీడియాలో దుమారం మొదలైంది.

ఈ మధ్యనే యాంకర్ అనసూయను కూడా ముసలమ్మలా ఉన్నావ్ అంటూ పదేపదే కామెంట్స్ చేస్తున్న ఆది ఆడవారి బాడీ షేమింగ్ కౌంటర్లు ఎక్కువ చేస్తున్నాడని మండిపడుతున్నారు. అసలే ఈ మధ్య కాలంలో వర్షకు బుల్లితెర మీద ఫాలోయింగ్ పెరుగుతుంది. అదే టైంలో ఇలా ఆది వర్ష బాడీ షేమింగ్ మీద కామెంట్ చేయడం దుమారం రేపుతున్నాయి. ఆది లేడీ యాంకర్ల పరువు తీసేలా బిహేవ్‌ చేస్తున్నాడంటూ నెటిజన్లు ఫైర్‌ అవుతున్నారు. పంచ్ లు వేయాలి కానీ అది ఇతర వారిని కించపరిచేలా ఉండకూడదని కొందరు ఆదికి హితవు పలుకుతున్నారు.