Kamal Nath: నేను హిందువున‌ని గ‌ర్వంగా చెప్పుకుంటాను, కానీ..: క‌మ‌ల్‌నాథ్

మ‌ధ్య‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు క‌మ‌ల్‌నాథ్ హిందూ మతంపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

Kamal Nath: నేను హిందువున‌ని గ‌ర్వంగా చెప్పుకుంటాను, కానీ..: క‌మ‌ల్‌నాథ్

Kamalnath

Kamal Nath: మ‌ధ్య‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు క‌మ‌ల్‌నాథ్ హిందూ మతంపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ”నేను హిందువున‌ని గ‌ర్వంగా చెప్పుకుంటాను.. కానీ, నేను అవివేకిని కాదు. మ‌న మ‌తం ఏదన్న విష‌యాన్ని మ‌న రాజ‌కీయాల ఆధారంగా ప‌రిగ‌ణించ‌వ‌ద్దు. మ‌న‌ మతం అనేది మ‌న‌ కుటుంబానికి సంబంధించిన అంశం. అంతేగానీ, రాజ‌కీయాల‌కు సంబంధించిన విష‌యం కాదు” అని ఆయ‌న అన్నారు. తాజాగా ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు.

Bermuda Triangle: బెర్ముడా ట్రయాంగిల్‌లో గ్ర‌హాంత‌ర వాసులు ఉన్నారా?

అలాగే, బీజేపీపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని బీజేపీ స‌ర్కారు ఓబీసీల ప‌ట్ల వివ‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ఆయ‌న ఆరోపించారు. పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో ఓబీసీల‌కు రిజ‌ర్వేష‌న్ల‌లో అతి త‌క్కువ‌ కోటా మాత్ర‌మే ఇచ్చింద‌ని చెప్పారు. ఓబీసీల‌కు 35 శాతం కోటా ఇస్తామ‌ని చెప్పిన బీజేపీ.. జిల్లా పంచాయ‌తీ స‌భ్యులకు ఎన్నిక‌ల స‌మ‌యంలో ఓబీసీల‌కు 11.2 శాతం, జ‌న్‌ప‌ద్ పంచాయ‌తీ అధ్య‌క్షుడి ప‌ద‌వుల్లో 9.5 శాతం, జ‌న్‌ప‌ద్ పంచాయ‌తీ స‌భ్యుడి కోటాలో 11.5 శాతం, స‌ర్పంచ్ ఎన్నిక‌ల్లో 12.5 శాతం కోటా మాత్ర‌మే కేటాయించింద‌ని క‌మ‌ల్‌నాథ్ విమ‌ర్శించారు.