Covid Hospital : కోవిడ్ సెంటర్లో ఆ యువకుడి చేస్తున్న పనికి..ఆశ్చర్యపోయిన కలెక్టర్..అభినందించారు

కులంగా జిల్లాకు చెందిన..విజయ్ కులాంగె.. ఐఏఎస్ అధికారి..ఓ కోవిడ్ ఆసుపత్రిని తరలించేందుకు వెళ్లారు. అక్కడ జరుగుతున్న ఏర్పాట్లు, రోగులకు అందుతున్న చికిత్స గురించి ఆరా తీశారు.

Covid Hospital : కోవిడ్ సెంటర్లో ఆ యువకుడి చేస్తున్న పనికి..ఆశ్చర్యపోయిన కలెక్టర్..అభినందించారు

Vijay IAS

CA Exam : కరోనా సోకిందనగానే..ఏదో అయిపోతుందని భయపడిపోతుంటారు. హోం ఐసోలేషన్ లో ఒంటరిగా ఎలా ఉండాలంటూ మనస్సలో బాధ పడుతుంటారు. కానీ.ఓ యువకుడి చేస్తున్న పని అందరి చేత వావ్ అనిపించేలా చేస్తోంది. అతను చేస్తున్న పనికి కలెక్టర్ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంతేగాదు..అభినందించారు. అసలు ఆ యువకుడు ఏమి చేశాడు ? ఎందుకు అతడిని అభినందిస్తున్నారు ?

భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రభంజనాల విజృంభిస్తోంది. లక్షల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతుండడం..వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ఈ రాష్ట్రం..ఆ రాష్ట్రం అనే తేడా లేకుండా..అన్ని ప్రాంతాల్లో వైరస్ విస్తరిస్తోంది. ఒడిశా రాష్ట్రంలో కూడా వైరస్ వ్యాపిస్తోంది. ప్రభుత్వం వైరస్ ను కట్టడి చేసేందుకు పలు చర్యలు తీసుకొంటోంది. వైరస్ సోకిన వారిని హోం ఐసోలేషన్ కేంద్రాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కులంగా జిల్లాకు చెందిన..విజయ్ కులాంగె.. ఐఏఎస్ అధికారి..ఓ కోవిడ్ ఆసుపత్రిని తరలించేందుకు వెళ్లారు. అక్కడ జరుగుతున్న ఏర్పాట్లు, రోగులకు అందుతున్న చికిత్స గురించి ఆరా తీశారు.

అయతే..ఓ వ్యక్తి బెడ్ పై కూర్చొని చదువుతుండడం విజయ్ ను ఆశ్చర్యపరిచింది. అతను ఎవరో తెలుసుకోవాలని అనిపించింది. వెంటనే అతడి వద్దకు వెళ్లారు. సీఏ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నట్లు, తన ధ్యాసంతా..సీఏ (ఛార్టెంట్ అకౌంట్) పరీక్షల మీదనే ఉందని ఆ యువకుడు తెలపడంతో కలెక్టర్ విజయ్ ఆశ్చర్యపోయారు. సదరు బాధితుడి అంకిత భావం పట్ల కలెక్టర్‌ ఆనందం వ్యక్తం చేశారు. అతడిని అభినందించారు. దీనికి సంబంధించిన ఫొటోను ట్విట్టర్ వేదికగా పోస్టు చేయడంతో వైరల్ గా మారిపోయింది. విద్యార్థి అంకిత భావానికి హాట్సాప్ తెలియచేస్తున్నారు నెటిజన్లు.

కరోనా నుంచి కోలుకుని…సీఏ ఎగ్జామ్స్ లో గెలుస్తావ్ అంటూ సదరు బాధితుడి అంకిత భావం పట్ల కలెక్టర్‌ ఆనందం వ్యక్తం చేశారు. కరోనా సోకిందని బాధపడకుండా ఆశాభావ దృక్పథంతో ఉన్నాడని కలెక్టర్‌ అతడిని అభినందించారు. అయితే, ప్రజలందరూ కూడా కరోనా సోకిందని, ఏదో అయిపోతుందనే భయాన్నివదిలిపెట్టాలని అన్నారు. ఈ మహమ్మారిని ధైర్యంతో ఎదుర్కొవాలని కోరారు. కాగా, ఈ పోస్ట్‌ను చూసిన నెటిజన్లు ా సీఎ విద్యార్థి అంకిత భావానికి హ్యట్సాఫ్‌.. మీరు కోవిడ్‌ను గెలుస్తారు.. సీఎ పరీక్షలోనూ విజయం సాధిస్తారని్ణ కామెంట్లు పెడుతున్నారు.

Read More : వోకల్ ఫర్ లోకల్ నుంచి ప్రపంచ సాయంపై ఆధారపడేలా..భారత్ కు ఏయే దేశం ఏమేం పంపుతుందో తెలుసా