Ravindra Jadeja: రవీంద్ర జడేజాకు ఐసీసీ షాక్.. వేలికి క్రీమ్ రాసుకున్నందుకు మ్యాచ్ ఫీజులో కోత

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్, 46వ ఓవర్ బౌలింగ్ చేసే సమయంలో రవీంద్ర జడేజా తన చేతి చూపుడు వేలికి క్రీమ్ రాసుకున్నాడు. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్, ఆర్టికల్ 2.20 ప్రకారం ఇలా చేయడం నేరం. ఇది క్రీడా స్ఫూర్తిని దెబ్బతీయడమే. దీంతో జడేజాపై ఐసీసీ చర్యలు తీసుకుంది.

Ravindra Jadeja: రవీంద్ర జడేజాకు ఐసీసీ షాక్.. వేలికి క్రీమ్ రాసుకున్నందుకు మ్యాచ్ ఫీజులో కోత

Ravindra Jadeja: ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో బౌలింగ్‌లో అద్భుతంగా రాణించిన రవీంద్ర జడేజాకు ఐసీసీ షాకిచ్చింది. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనలు ఉల్లంఘించినందుకుగాను అతడికి జరిమానా విధించింది.

Hyderabad E-Race: ముగిసిన ఫార్ములా ఈ-రేసింగ్.. విజేతగా నిలిచిన జీన్ ఎరిక్ వెర్గ్నే

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్, 46వ ఓవర్ బౌలింగ్ చేసే సమయంలో రవీంద్ర జడేజా తన చేతి చూపుడు వేలికి క్రీమ్ రాసుకున్నాడు. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్, ఆర్టికల్ 2.20 ప్రకారం ఇలా చేయడం నేరం. ఇది క్రీడా స్ఫూర్తిని దెబ్బతీయడమే. దీంతో జడేజాపై ఐసీసీ చర్యలు తీసుకుంది. నిబంధనల ప్రకారం ఈ చర్యకు పాల్పడ్డందుకుగాను, అతడి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించింది. మరోవైపు జడేజా తాను చేసిన పొరపాటును అంగీకరించారు.

మ్యాచ్ రిఫరీ ఈ అంశంపై నిర్ణయం తీసుకుని, ఫైన్ విధించారు. జడేజా తన వైద్య పరమైన అవసరంలో భాగంగానే, చేతికి క్రీమ్ రాసుకున్నట్లు గుర్తించారు. బాల్ రూపు, ఆకారాన్ని మార్చేందుకు కాదని మ్యాచ్ రిఫరీ అంగీకరించారు. జడేజా చేసిన పని వల్ల బాల్ ఏ రకంగానూ మార్పు చెందలేదు. దీంతో లెవల్ 1 పొరపాటుగా గుర్తించి, తక్కువ పెనాల్టీ విధించారు.