India Vs South Africa : మహిళల ప్రపంచ కప్.. భారత్ ముందుకెళుతుందా ?

మూడు మ్యాచ్ లు గెలిచి మరో మూడు మ్యాచ్ ల్లో ఓటమి పాలు కావడంతో సెమీస్ అవకాశాలు సంక్లిష్టమయ్యాయి...మిథాలీ సేన కీలక సమరానికి సై అంటోంది. చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ లో..

India Vs South Africa : మహిళల ప్రపంచ కప్.. భారత్ ముందుకెళుతుందా ?

Icc

ICC Women’s World Cup : మహిళల ప్రపంచ కప్ లో భారత్ ముందుకెళుతుందా ? లేక గెలవాల్సిన మ్యాచ్ లో మహిళా క్రీడాకారిణిలు వత్తిడికి గురవుతారా ? అనేది కొద్ది గంటల్లో తేలనుంది. మిథాలీ సేన కీలక సమరానికి సై అంటోంది. చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ లో 2022, మార్చి 27వ తేదీ ఆదివారం దక్షిణాఫ్రికా జట్టును ఢీ కొనబోతోంది. మూడు మ్యాచ్ లు గెలిచి మరో మూడు మ్యాచ్ ల్లో ఓటమి పాలు కావడంతో సెమీస్ అవకాశాలు సంక్లిష్టమయ్యాయి. ఏదో అద్భుతం జరిగితే తప్ప.. భారత్ సెమీస్ చేరుతుందని క్రీడా విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం భారత్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. సెమీ ఫైనల్లో చోటు దక్కాలంటే మాత్రం దక్షిణాఫ్రికా జట్టును ఓడించి తీరాల్సి ఉంటుంది. ప్రధానంగా భారత బ్యాటింగ్ విభాగంలో నిలకడలేమి కనబరుస్తున్నారు. ఓపెనర్లు, కెప్టెన్ మిథాలీ రాజ్ ఫుల్ ఫామ్ లోకి వస్తే భారత్ విజయం సాధించడం ఖాయమంటున్నారు. వెస్టిండీస్ జట్టుపై స్మృతి మంధాన సెంచరీ సాధించడం మినహా.. ఇతర మ్యాచ్ ల్లో పేలవమైన ఆటతీరును కనబర్చారు. వైస్ కెప్టెన్ గా ఉన్న హర్మన్ ప్రీత్ కౌర్ ఫామ్ లో ఉన్నారు. అత్యంత నిలకడగా రాణిస్తూ.. భారత్ సాధించిన విజయాల్లో ఈమె కీలక పాత్ర పోషించారు.

Read More : PV Sindhu : స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్.. ఫైనల్లో పీవీ సింధు, ప్రణయ్

ఇక దక్షిణాఫ్రికా జట్టు విషయానికి వస్తే… మంచి ఆట తీరు కనబరుస్తూ. సెమీ ఫైనల్ వరకు దూసుకొచ్చింది. ప్రస్తుతం ఈ జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఆత్మ విశ్వాసంతో దిగుతున్న ఈ జట్టును ఢీకొని భారత్ విజయం సాధిస్తుందా అని క్రీడాభిమానులు ఆలోచిస్తున్నారు. సెమీ ఫైనల్లో భారత్ ఓడిపోతే.. తనకన్నా మెరుగైన రన్ రేట్ లో ఉన్న ఇంగ్లాండ్ చివరి మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై ఓడిపోవాలని భారత అభిమానులు కోరుకోవాల్సి ఉంటుంది. అలా కాకపోతే.. దక్షిణాఫ్రికాను ఓడించాల్సిందే.

Read More : ICC Women’s World Cup : మహిళల వన్డే ప్రపంచ కప్.. కష్టాల్లో భారత్ 128/8

పాయింట్ల పట్టికలో టాప్ 04లో నిలిచిన జట్లు మాత్రమే సెమీస్ కు అర్హత సాధిస్తాయి. ఆరు మ్యాచ్ లు ఆడి.. అన్నీ మ్యాచ్ ల్లో విజయం సాధించిన ఆసీస్ మహిళా టీం 12 పాయింట్లతో నెంబర్ వన్ స్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా ఆరు మ్యాచ్ లు ఆడి.. నాలుగు విజయాలు, ఒకటి ఓటమి, మరొకటి రద్దుతో మొత్తం 9 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. మిగిలిన రెండు బెర్త్ ల కోసం వెస్టిండీస్ (7 పాయింట్లు), ఇంగ్లాండ్ (6 పాయింట్లు), భారత్ (6 పాయింట్లు) పోటీల్లో కొనసాగుతున్నాయి. వెస్టిండీస్ ని దక్షిణాఫ్రికా ఓడించే ఉంటే… భారత్ సెమీస్ అవకాశాలు సజీవంగా ఉండేవి. కానీ అలా జరగలేదు. వరుణుడి దెబ్బతో సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. దక్షిణాఫ్రికాపై భారత్ గెలిస్తే.. 8 పాయింట్లతో మూడో స్థానానికి ఎగబాకుతుంది. ఏదైనా అద్భుతం జరుగుతుందా ? లేదా ? అనేది చూడాలి.