Rashmika: రష్మికకి కోపమొస్తే ఇలా చూపిస్తుందా..? వీడియో వైరల్!

టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న రష్మిక మందాన నేషనల్ వైడ్ కుర్రాళ్ల కళల రాణిగా మారిపోయింది. ఉన్న ప్రాజెక్టులే క్రేజీ ప్రాజెక్టులనుకుంటే కొత్తగా భారీ..

Rashmika: రష్మికకి కోపమొస్తే ఇలా చూపిస్తుందా..? వీడియో వైరల్!

Rashmika

Updated On : October 23, 2021 / 3:22 PM IST

Rashmika: టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న రష్మిక మందాన నేషనల్ వైడ్ కుర్రాళ్ల కళల రాణిగా మారిపోయింది. ఉన్న ప్రాజెక్టులే క్రేజీ ప్రాజెక్టులనుకుంటే కొత్తగా భారీ ప్రాజెక్టుల మీద ఫోకస్ చేసిన రష్మిక తనను తానూ ప్రూవ్ చేసుకొనేందుకు ఆరాటపడుతుంది. కాగా, రష్మిక ఫిట్నెస్ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ అయ్యేది లేదని ఇప్పటికే చాలాసార్లు చెప్పింది. ఏ మాత్రం టైం గ్యాప్ దొరికిన జిమ్ లో గడిపేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఫ్యాన్స్ ను అలరిస్తుంది.

Venu Swamy: రకుల్‌కు షాక్.. ప్రేమ విఫలమవుతుందని చెప్పిన వేణుస్వామి!

ఒక్క జిమ్ మాత్రమే కాదు.. బాడీతో మైండ్ కూడా కంట్రోల్ ఉండాలి కనుక యోగా కూడా అవసరమే అంటూ ఆ వీడియోలు కూడా షేర్ చేస్తుంటుంది. తాజాగా రష్మిక జిమ్‌ లో వర్కౌట్‌ చేస్తున్న ఓ వీడియోని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. అందులో రష్మిక తన ఫిట్‌నెస్ ట్రైనర్ పట్టుకున్న స్ట్రైకింగ్ ప్యాడ్‌ను ఎగిరెగిరి తన్నుతుంటే మరింత గట్టిగా తన్నమని ట్రైనర్ రష్మికను ప్రోత్సహిస్తున్నాడు. ఈ వీడియోని రష్మిక ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ.. చాలా కోపంగా ఉన్నప్పుడు నేను ఏమి చేస్తాను’అంటూ క్యాప్షన్‌ ఇచ్చింది.

Sankranti 2022 Films: సంక్రాంతి పందెం కోళ్లు.. నిజంగా పెద్ద పండగే!

ఈ వీడియోకి నటుడు, దర్శకుడు తనదైన శైలీలో స్పందిచాడు. ‘ఈ వీడియో చూశాక ఏ దర్శకుడైనా నిన్ను రీటేక్‌ కోసం అడుగుతాడా? టేక్‌ ఓకే’ అంటూ కామెంట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుండగా నెటిజన్లు వీడియోపై రకరకాల కామెంట్లు చేస్తున్నారు. రష్మికకి కోపమొస్తే ఇలానే ఎగిరెగిరి తన్నుతుందేమో అని కొందరు రష్మిక ఎదిగిన ప్రశ్నకు ఫన్నీగా ఆన్సర్ చెప్తుంటే.. రష్మిక అందం వెనక ఇంత కష్టం ఉందా అని కొందరు రష్మికను తెగ పొగిడేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)