Odish : మహిళలు ముందుగా బస్సెక్కితే అపశకునం అట .. రవాణా సంస్థల తీరుపై ఆగ్రహం

బస్సులో మొదటి ప్రయాణికురాలిగా మహిళలు బస్సెక్కితే ప్రమాదం జరుగుతుందని.. ఆరోజు వారి బస్సులకు ఆదాయం తక్కువ వస్తుందనే మూఢ నమ్మకాలు అక్కడి ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలు నడుపుతున్న బస్సుల యాజమాన్యాలకు ఉన్నాయి. దీంతో బస్సు బయలుదేరిన తరువాత మొదటిగా మహిళలను బస్సు ఎక్కనివ్వటంలేదు.

Odish : మహిళలు ముందుగా బస్సెక్కితే అపశకునం అట .. రవాణా సంస్థల తీరుపై ఆగ్రహం

Odish government and private transport

Odish government and private : మహిళలను లక్ష్మీదేవితో పోలుస్తారు. ఇంటిలో ఎవరైనా ఏదైనా పనిమీద బయటకు వెళితే ఇంటి ఇల్లాలిని ఎదురు రమ్మంటారు. భారతీయ సంప్రదాయంలో మహిళలకు అంతటి విలువు, గౌరవాలు ఉన్నాయి. కానీ ఒడిశాలో మాత్రం ప్రభుత్వ, ప్రైవేటు రవాణా సంస్థలు (government and private)మహిళలను అవమానకరంగా చూస్తున్నాయి. బస్సులో ముందుగా మహిళలు ఎక్కకూడదట..అలా ఎక్కితే అపశకునం అంటూ అవమానిస్తున్నారు. బస్సు బయలుదేరిన తరువాత ముందుగా బస్సులో మహిళలు ఎక్కితే ఆరోజు అపశకునం జరుగుతుందని బస్సుకు కలెక్షన్లు రావట..ఇది ఒడిశాలో బస్సులు ఎక్కే మహిళలకు జరుగుతున్న అవమానం…

బస్సులో మొదటి ప్రయాణికురాలిగా మహిళలు బస్సెక్కితే ప్రమాదం జరుగుతుందని..లేదా ఆరోజు వారి బస్సులకు ఆదాయం తక్కువ వస్తుందనే మూఢ నమ్మకాలు అక్కడి ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలు నడుపుతున్న బస్సుల యాజమాన్యాలకు ఉన్నాయి. దీంతో బస్సు బయలుదేరిన తరువాత మొదటిగా మహిళలను బస్సు ఎక్కనివ్వటంలేదు. అటువంటి ఘటన బుధవారం (జులై 26,2023)న జరిగింది.

Andhra Praedesh : ఫేస్ బుక్ కలిపింది ఇద్దరిని .. చిత్తూరు యువకుడిని పెళ్లాడిన శ్రీలంక యువతి

భువనేశ్వర్‌లోని బర్ముండ బస్టాండ్‌(Baramunda bus stand )లో మల్కాన్‌గిరి జిల్లాకు వెళ్లేందుకు ఓ మహిళ బస్సు కోసం ఎదురు చూస్తోంది. కాసేపటికి బస్సు రానే వచ్చింది.దీంతో ఆమె తాను ఎక్కాల్సిన బస్సు రావటంతో దీంతో కండక్టర్ ఆమెను అడ్డుకున్నాడు. బస్సు ఎక్కవద్దన్నాడు. ఎందుకు అని ఆమె అడిగేలోగా ఓ వ్యక్తి వచ్చి బస్సు ఎక్కాడు. పురుషుడు మొదటిగా ఎక్కడంతో కండక్టర్‌ అతడు ఎక్కిన తరువాత ఆమెను లోపలకు ఎక్కొచ్చని చెప్పాడు.

ఇదంతా అక్కడే ఉన్న ఘసిరాం పండా అనే ఓ సామాజిక కార్యకర్త (Social worker Ghasiram Panda)గమనించారు. అదే విషయాన్ని రాష్ట్ర మహిళా కమిషన్‌ అధ్యక్షురాలు (OCSW) మినతి బెహరకు (Minati Behara)లేఖ రాశారు. మహిళను అపశకునంగా భావిస్తున్నారని, కండక్టర్‌ ప్రవర్తించిన తీరు హేయమైనదని..బస్సుల్లోకి తొలిగా మహిళలను ఎక్కించకపోవడం ఆటవిక చర్య అంగూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన మినతి బెహరా తక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్, చైర్మన్ అమితాబ్ ఠాకూర్‌(Transport Commissioner cum Chairman Amitabh Thakur )కు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో అప్రమత్తమైన సహాయ కమిషనర్‌ లాల్‌ మోహన్‌ శెఠి ప్రభుత్వ, ప్రైవేటు బస్సుల్లోకి మహిళలు ముందుగా వస్తే అనుమతించాలన్నారు. ఈ ఆదేశాలు ఎవరైనా ఉల్లంఘిస్తే శిక్షార్హులు అవుతారని ఆదేశించారు. స్త్రీలను లక్ష్మీదేవి,కాళీ స్వరూపంగా పరిగణించాలని స్త్రీల విషయంలో ఎలాంటి వివక్ష ఉండకూడదు అని సూచించారు.