Bermuda Grass : గరిక గడ్డితో ప్రయోజనాలు తెలిస్తే… అస్సలు వదలిపెట్టరు!..
మూత్రసమస్యలు, మూత్ర పిండాల్లో రాళ్ళు కరిగిపోవాలంటే గరిక బాగాపనిచేస్తుంది. గరికతో ఒక కప్పు కషాయం కాసుకుని ఉదయం, సాయంత్ర తాగితే మూత్రపిండాల్లో రాళ్ళు వాటంతటమే కరిగిపోతాయి.

Grass (1)
Bermuda Grass : గరిక గడ్డి అంటే తెలియని వారుండరు. మన చుట్టుపక్కల నేలపై కనిపించే చిన్నజాతి మొక్క గరిక…దీనిని పశువులు ఆహారంగా తీసుకుంటాయి. అయితే ఈ గడ్డిజాతి మొక్కలో ఎన్నో ఔషదగుణాలు ఉన్నాయంటే చాలా మందికి ఏమాత్రం నమ్మకం కలుగదు. ఆయుర్వేద శాస్త్రంలో గరిక గడ్డి విశిష్టతను ఎంతో గొప్పగా తెలియజేశారు. అంతేకాదు గణపతి పూజకు గరికను ఉపయోగిస్తాం.
అనారోగ్యసమస్యలతోపాటు, అనేక వ్యాధులను తగ్గించటంలో ఇది ఎంతగానో దోహదపడుతుంది. గరిక గడ్డిని ముద్దగా నూరి నెయ్యి కలిపి మిశ్రమంగా మార్చుకుని చర్మంపై ఏర్పడే పొక్కులు వంటి వాటిపైన రాస్తే సులభంగా అవి తగ్గిపోతాయి. అలర్జీలు, దద్దుర్లు, గాయాలు, పుండ్లు వంటి వాటిపైన రాసినా చక్కని ఫలితం ఉంటుంది.
అల్సర్ తో బాధపడుతున్న వారు గరికను బాగా ఎండబెట్టి పొడిలా మార్చుకుని ప్రతిరోజు అరకప్పు నీటిలో ఒక స్పూన్ గరిక పొడి వేసుకుని త్రాగటం వల్ల అల్సర్లు తొలగిపోతాయి. చుండ్రు సమస్యలతో బాధపడుతున్న వారు లీటరు కొబ్బరి నూనెలో రెండు లీటర్ల గరిక ఆకుల రసాన్ని బాగా మరిగించి రోజు తలకు రాసుకుంటే చుండ్రు సమస్యలు దూరమౌతాయి.
మూత్రసమస్యలు, మూత్ర పిండాల్లో రాళ్ళు కరిగిపోవాలంటే గరిక బాగాపనిచేస్తుంది. గరికతో ఒక కప్పు కషాయం కాసుకుని ఉదయం, సాయంత్ర తాగితే మూత్రపిండాల్లో రాళ్ళు వాటంతటమే కరిగిపోతాయి. మూత్రంలో రక్తం పడటం, మూత్రంలోమంట వంటి సమస్యలకు గరిక రసం చక్కని పరిష్కారంగా ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
మహిళల్లో వచ్చే వైట్ డిశ్ఛార్జీ వంటి సమస్యలకు గరికవేళ్ళను దంచి రెండు టీస్పూన్ల గరిక పేస్టును ఒక కప్పు పెరుగులో కలిపి తీసుకుంటే సమస్య పరిష్కారమౌతుంది. జ్వరం, ఫ్లూ వంటి వాటికి గరిక బాగా పనిచేస్తుంది. తీవ్రమైన తలనొప్పుల నివారణకు గరిగడ్డితో చేసిన కషాయం చక్కగా పనిచేస్తుంది.