Nizamabad : నిజామాబాద్ జిల్లాలో కల్తీ కల్లు తాగి పలువురికి అస్వస్ధత

నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సంగం గ్రామంలో కల్తీకల్లు కలకలం సృష్టించింది.

Nizamabad : నిజామాబాద్ జిల్లాలో కల్తీ కల్లు తాగి పలువురికి అస్వస్ధత

Nizamabad kalthi kallu

Nizamabad :  నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సంగం గ్రామంలో కల్తీకల్లు కలకలం సృష్టించింది. కల్లు కాంట్రాక్టర్  కల్తీకల్లు విక్రయించడంతో పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గ్రామంలో జరిగిన వెంకటేశ్వర స్వామి జాతర సందర్భంగా  కల్లు విక్రయాలు పెద్దఎత్తున చేపట్టారు.  జాతరం సందర్భంగా  పలువురు కల్లు సేవించారు. కల్లు సేవించిన కొంతసేపటికి వారంతా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

తలనొప్పి, నాలుక మొద్దు బారిపోవడం, ఎక్కడి వారక్కడ స్పృహతప్పి పడిపోవటం జరిగింది. ఉదయం నుండి అస్వస్థతకు గురైన వారిని చికిత్స నిమిత్తం బోధన్‌లో ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. కల్తీకల్లు బారిన పడినవారు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
Also Read : Gutkha Seized : రూ.49 లక్షల విలువైన గుట్కా స్వాధీనం చేసుకున్న పోలీసులు
జాతర సందర్భంగా కల్లు కాంట్రాక్టర్ ఎక్కువ మొత్తంలో కల్లు విక్రయాలు జరిపేందుకు కల్తీకల్లు తయారు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.  కల్తీకల్లు విక్రయాలు జరిపిన వారిపై ఎక్సైజ్ అధికారులు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. చికిత్స పొందుతున్న వారి వైద్య ఖర్చులు కల్లు కాంట్రాక్టరే చెల్లించాలని ప్రజలు డిమాండ్ చేశారు.