Gutkha Seized : రూ.49 లక్షల విలువైన గుట్కా స్వాధీనం చేసుకున్న పోలీసులు

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రూరల్ పోలీసులు రెండు వేర్వేరు సమయాల్లో దాడి చేసి ఒకే వ్యక్తి వద్దనుంచి రూ.49 లక్షల విలువైన నిషేధిత గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.

Gutkha Seized : రూ.49 లక్షల విలువైన గుట్కా స్వాధీనం చేసుకున్న పోలీసులు

Gutkha Seized West Godavari District

Updated On : December 20, 2021 / 12:07 PM IST

Gutkha Seized :  పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రూరల్ పోలీసులు రెండు వేర్వేరు సమయాల్లో దాడి చేసి ఒకే వ్యక్తి వద్దనుంచి రూ.49 లక్షల విలువైన నిషేధిత గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.

తాడేపల్లిగూడెం రూరల్ సర్కిల్ పోలీసుల ఆధ్వర్యంలో మానేపల్లి సతీష్ అనే వ్యక్తి…కుంచనపల్లిలోని ఒక ఇంట్లో అక్రమంగా దాచి ఉంచిన రూ.19 లక్షల రూపాయల విలువైన గుట్కా ప్యాకెట్లు ఈ నెల 6 తేదీన స్వాధీనం చేసుకున్నారు. మరలా అదే వ్యక్తి వద్దనుంచి నిన్న రూ. 30 లక్షల రూపాయల విలువచేసే గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు కొవ్వూరు రేంజ్ డీఎస్పీ తెలిపారు.

Also Read : Heroin Seized : గుజరాత్​లో రూ.400 కోట్ల విలువైన 77 కిలోల హెరాయిన్ స్వాధీనం

నిందితులు గుట్కా, ఖైనీ ప్యాకెట్లను ఒరిస్సా, కర్ణాటక రాష్ట్రాల నుంచి తెప్పించినట్లు పోలీసులు చెప్పారు. వాటితో పాటు రెండు లీటర్ల నాటుసారా లభ్యం అయినట్లు తెలిపారు. మానేపల్లి సతీష్(35),షేక్ బాషా(24),మానేపల్లి శివ కుమార్(36) అనే ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించినట్లు వెల్లడించారు. నిందితులు గతంలో 7 సార్లు ఖైనీ గుట్కా తీసుకువచ్చి అమ్ముకున్నట్లు పోలీసులు తెలిపారు.