Heroin Seized : గుజరాత్​లో రూ.400 కోట్ల విలువైన 77 కిలోల హెరాయిన్ స్వాధీనం

పాకిస్థాన్​కు చెందిన పడవలో హెరాయిన్​ను తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న భారత తీరరక్షణ దళం, గుజరాత్ ఏటీఎస్ అధికారులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు.

Heroin Seized : గుజరాత్​లో రూ.400 కోట్ల విలువైన 77 కిలోల హెరాయిన్ స్వాధీనం

Drugs Seized In Gujarat Coast

Heroin Seized :  గుజరాత్ లో భారీ ఎత్తున మాదక ద్రవ్యాలను  అధికారులు పట్టుకున్నారు. పాకిస్తాన్‌కు చెందిన ఒక పడవలో తరలిస్తున్న రూ.400 కోట్లు విలువైన 77 కిలోల హెరాయిన్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

పాకిస్థాన్​కు చెందిన పడవలో హెరాయిన్​ను తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న భారత తీరరక్షణ దళం, గుజరాత్ ఏటీఎస్ అధికారులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు. పడవ భారత జలాల్లోకి ప్రవేశించగానే వెంబడించి దాన్ని నిలిపివేశారు.  అందులోని 77 కిలోల హెరాయిన్ ను స్వాధీనం చేసుకుని…. దాన్ని తరలిస్తున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
Also Read : Paddy Procurement : ఢిల్లీకి చెరిన తెలంగాణ మంత్రులు… వరి కొనుగోలుపై కేంద్రంతో చర్చలు
పాకిస్థాన్ పడవను అధికారులు కచ్ జిల్లాలోని జఖావు తీరానికి తీసుకువచ్చారు.  ఇటీవలి కాలంలో గుజరాత్ లో మాదక ద్రవ్యాలు తరచూ పట్టుబడుతున్నాయి. పాకిస్థాన్ నుంచి  తీసుకువస్తున్న డ్రగ్స్ గుజరాత్ తీరంలో భారీగా పట్టుబడుతున్నాయి. ఏప్రిల్​లో రూ.150 కోట్ల విలువైన 30 కేజీల హెరాయిన్​ను సీజ్ చేయగా… సెప్టెంబర్​లో ముంద్రా పోర్టులో రూ. 21 వేల కోట్ల విలువైన డ్రగ్స్   అధికారులు పట్టుకున్నారు. నవంబర్​లో మోర్బి జిల్లాలో  సుమారు రూ.700 కోట్ల విలువైన 144 కిలోల హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఈ డ్రగ్స్ కూడా పాకిస్ధాన్ నుంచి సముద్రమార్గం ద్వారా గుజరాత్ చేరినట్లు గుర్తించారు. గత కొన్నేళ్లుగా పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ దేశాలనుంచి డ్రగ్స్ ను రవాణా చేసేందుకు గుజరాత్ తీర ప్రాంతం ఒక  అనువైన మార్గంగా మారినట్లు అధికారులు గుర్తించారు.