Paddy Procurement : ఢిల్లీకి చేరిన తెలంగాణ మంత్రులు… వరి కొనుగోలుపై కేంద్రంతో చర్చలు

తెలంగాణలో ధ్యాన్యం కొనుగోళ్ల పంచాయతీ ఢిల్లీకి చేరింది. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన అంశంపై కేంద్రంతో తేల్చుకునేందుకు రాష్ట్ర మంత్రులు ఢిల్లీ చేరారు.

Paddy Procurement : ఢిల్లీకి చేరిన తెలంగాణ మంత్రులు… వరి కొనుగోలుపై కేంద్రంతో చర్చలు

Telangna Ministers At Delhi

Paddy Procurement :  తెలంగాణలో ధ్యాన్యం కొనుగోళ్ల పంచాయతీ ఢిల్లీకి చేరింది. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన అంశంపై కేంద్రంతో తేల్చుకునేందుకు రాష్ట్ర మంత్రులు ఢిల్లీ చేరారు. వ్యవసాయశాఖమంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో పాటు..గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, జగదీశ్వర్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, వేముల ప్రశాంత్ రెడ్డి పలువురు ఎంపీలు ఢిల్లీ చేరుకున్నారు. వానాకాలం పంట, అదనపు ధాన్యం కొనుగోలుపై కేంద్రం నుంచి స్పష్టత, యాసంగిలో ధాన్యం కొనుగోళ్ల పై స్పష్టత అంశాలపై మంత్రులు… కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు.

కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అపాయింట్ మెంట్ కోసం తెలంగాణ అధికారుల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈరోజు వారు గోయల్‌తో చర్చించే అవకాశం ఉఁది. గత నాలుగు నెలలుగా ధాన్యం కొనుగోలు అంశంపై తెలంగాణ మంత్రులు, ఎంపీలు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికి రెండు సార్లు పీయూష్ గోయల్‌ను కలిసి చర్చలు జరిపారు. పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ధాన్యం కొనుగోళ్లపై పొంతన లేని సమాధానాలు ఇస్తున్నారని,తెలంగాణ రైతులకి అన్యాయం చేసురున్నారని ఆరోపిస్తూ టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ శీతాకాల సమావేశాలను బహిష్కరించారు.
Also Read : Lowest Temperatures : చలి పులి…ఆదిలాబాద్‌లో 6 డిగ్రీలు…ఢిల్లీలో 4 డిగ్రీల ఉష్ణోగ్రత

ఈ క్రమంలో అధికారులు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ అపాయింట్‌మెంట్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వానాకాలం ధాన్యానికి సంబంధించి అదనపు ధాన్యం సేకరణపై ఇప్పటి వరకు ఎలాంటి ఆమోదం, నిర్ణయాన్ని ప్రకటించలేదు. ఈ క్రమంలో ధాన్యం కొనుగోళ్ల అంశంపై కేంద్రంతో మరోసారి మాట్లాడాలని నిర్ణయించారు. ఆది, సోమవారాల్లో ప్రధాని, కేంద్రమంత్రితో సమావేశమయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.4 నెలలుగా ధాన్యం కొనుగోళ్ల అంశంపై ఢిల్లీ చుట్టూ తిరుగుతున్న తెలంగాణ మంత్రులు, ఎంపీలు