Massive Landslide: ఉత్తరాఖండ్‌లో విరిగిపడిన కొండ చరియలు.. చిక్కుకపోయిన 300 మంది ప్రయాణికులు

రాష్ట్రంలో వర్ష ప్రభావం కూడా ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోని అల్మోరా, బాగేశ్వర్, చమోలి, చంపావత్, డెహ్రాడూన్, గర్వాల్, హర్‌ద్వార్, నైనిటాల్, పితోర్‌ఘర్, రుద్రప్రయాగ్, తెహ్రీ గర్వాల్, ఉధమ్ సింగ్ నగర్, ఉత్తరకాశీ జిల్లాల్లో దుమ్ము తుఫాను, ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది వాతావరణ శాఖ తెలిపింది.

Massive Landslide: ఉత్తరాఖండ్‌లో విరిగిపడిన కొండ చరియలు.. చిక్కుకపోయిన 300 మంది ప్రయాణికులు

Updated On : June 1, 2023 / 10:27 AM IST

Uttarakhand: ఉత్తరాఖండ్‌లోని పితోర్‌ఘర్ జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో కీలకమైన రహదారి కొట్టుకుపోయింది. దీంతో కనీసం 300 మంది ప్రయాణికులు చిక్కుకుపోయినట్లు స్థానిక అధికారులు తెలిపారు. లఖన్‌పూర్ సమీపంలోని లిపులేఖ్-తవాఘాట్ రహదారి 100 మీటర్ల మేర భారీ కొండచరియ పడిపోయింది. ధార్చుల, గుంజి రెండు ప్రాంతాల్లో ప్రయాణికులు చిక్కుకున్నట్లు సమాచారం.

Karnataka Politics: కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా పని చేసిన సునీల్ కనుగోలుకు భారీ బహుమతే ఇచ్చిన సీఎం సిద్ధరామయ్య

నివేదికల ప్రకారం, ఈ రోడ్డు మరమ్మత్తుల అనంతరం రెండు రోజుల క్రితమే తెరిచారు. కాగా, యాత్రికులందరూ సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. “యాత్రికులు దయచేసి సురక్షిత ప్రదేశాలలో ఉండండి. అనవసరంగా ప్రయాణించవద్దు, సురక్షితమైన ప్రదేశాలలో వాహనాలను పార్క్ చేయండి. వాతావరణం స్పష్టంగా ఉన్నప్పుడు మాత్రమే ప్రయాణించండి” అని పోలీసులు తెలిపారు. “యమునోత్రి, గంగోత్రి ధామ్ యాత్రకు వచ్చే భక్తులందరూ వాతావరణ సూచన తీసుకున్న తర్వాత తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలి. ప్రయాణ సమయంలో రెయిన్ కవర్, గొడుగు, ఉన్ని/వెచ్చని దుస్తులను తమతో ఉంచుకోవాలి” అని వారు సూచించారు.

Rajasthan Politics: అశోక్ గెహ్లాట్‭తో చేతులు కలిపినప్పటికీ ఆ విషయంలో మాత్రం తగ్గేదేలే అంటున్న సచిన్ పైలట్

ఇక దీనితో పాటు రాష్ట్రంలో వర్ష ప్రభావం కూడా ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోని అల్మోరా, బాగేశ్వర్, చమోలి, చంపావత్, డెహ్రాడూన్, గర్వాల్, హర్‌ద్వార్, నైనిటాల్, పితోర్‌ఘర్, రుద్రప్రయాగ్, తెహ్రీ గర్వాల్, ఉధమ్ సింగ్ నగర్, ఉత్తరకాశీ జిల్లాల్లో దుమ్ము తుఫాను, ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది వాతావరణ శాఖ తెలిపింది.