Petrol Rates : ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం పెట్రో ధరలు పెరుగుతాయా ?

అంతర్జాతీయంగా ధరలు పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ధరల్లో ఎలాంటి మార్పూ చేయడం లేదు. ఎన్నికల వేళ ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుందన్న కారణంతో వెనకడుగు వేస్తున్నాయని

Petrol Rates : ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం పెట్రో ధరలు పెరుగుతాయా ?

Petrol Price

5 States assembly poll : పెట్రోలో, డీజిల్ ధరలు పెరగడం లేదనే ఆనందం ఎక్కువ రోజులు నిలిచేలా కనిపించడం లేదు. మరోసారి పెట్రో బాదుడుకు చమురు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. వచ్చే నెలతో ముగిసే ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత చమురు ధరలు భారీగా పెరగనున్నాయని డెలాయిట్‌ ఇండియా ఎల్‌ఎల్‌పీ పేర్కొంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల కారణంగా రిటైల్‌ ధరల్లో చమురు కంపెనీలు ఎలాంటి మార్పు చేయడం లేదని డెలాయిట్ అభిప్రాయపడింది. మార్చి 10 తర్వాత 8 నుంచి 9 రూపాయల మేర ధరలు పెంచే అవకాశం ఉంది.

Read More : Sumanth : రాజకీయాల్లో చిన్నప్పటి నుంచి ఇదే చూస్తున్నాం.. పవన్, జగన్ పై మాట్లాడిన సుమంత్..

ఓ వైపు అంతర్జాతీయంగా ధరలు పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ధరల్లో ఎలాంటి మార్పూ చేయడం లేదు. ఎన్నికల వేళ ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుందన్న కారణంతో వెనకడుగు వేస్తున్నాయని తెలిపింది. ఒకవేళ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగినా ప్రభుత్వం పన్నుల రూపంలో ఎంతోకొంత తగ్గిస్తుందని, మిగిలిన భారాన్ని ప్రజలే మోయాల్సి ఉంటుందని వెల్లడించింది. పెరిగిన చమురు ధరలతో ఇటు ప్రభుత్వానికి, అటు ఆర్‌బీఐకి కూడా ఇబ్బందికరమేనంది. చమురు ధరలు పెరిగితే ద్రవ్యోల్బణం కూడా పెరిగి నిత్యావసరాల ధరలు పెరుగుతాయి. అంతర్జాతీయంగా బ్యారెల్‌ చమురు ధర 100 డాలర్లు దాటితే రిటైల్‌ ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటును అదుపు చేయడం భారత్‌కు సవాల్‌ కానుందన్నారు డెలాయిట్ సీఈవో.

Read More : Coronavirus: దేశంలో తగ్గిన కరోనా కేసులు

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా ఉత్తరప్రదేశ్‌లో తొలి విడత ఎన్నికల పోలింగ్‌ 2022, ఫిబ్రవరి 10వ తేదీ గురువారం ఉదయం 7 గంటలకు స్టార్ట్ అయ్యింది. ఇప్పటికే ఎన్నికల సంఘం పకడ్భందీ ఏర్పాట్లు చేసింది. మొదటి విడతలో పశ్చిమ యూపీలోని 11 జిల్లాల్లో 58 అసెంబ్లీ స్ధానాలకు పోలింగ్ జరుగుతోంది.