ఇంగ్లాండ్‌ని చుట్టేసిన భారత్.. రెండో టెస్ట్‌లో అద్భుత విజయం

ఇంగ్లాండ్‌ని చుట్టేసిన భారత్.. రెండో టెస్ట్‌లో అద్భుత విజయం

Ind vs Eng 2nd Test: ఇంగ్లాండ్‌తో సొంతగడ్డపై పోరులో చెపాక్‌ వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత జట్టు విజయం సాధించింది. అశ్విన్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఇంగ్లాండ్‌ సుదీర్ఘ ఫార్మాట్‌లో భారీ ఓటమి చవిచూసింది. 482 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 164 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో విజృంభించిన.. అక్షర్‌ 5/60, అశ్విన్‌ 3/53 మరోసారి చెలరేగడంతో భారత్‌..‌ 317 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

అనుకూలంగా ఉంటూ బ్యాటింగ్‌కు కష్టమైన సమయంలో అశ్విన్‌ సెంచరీతో రాణించగా.. కీలక సమయంలో అద్భుత ప్రదర్శనతో సెంచరీ సాధించిన అతను రెండో టెస్టును పూర్తిగా టీమిండియా చేతుల్లోకి తీసుకుని వచ్చాడు. అహ్మదాబాద్‌లో జరిగే ‘పింక్‌ టెస్టు’కు ముందు టెస్టు సిరీస్‌ 1–1తో సమం చేసి జోష్‌లో ఉంది భారత జట్టు.. 53/3 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో నాలుగో రోజు మంగళవారం ఆట మొదలెట్టిన ఇంగ్లాండ్‌ మరో 111 పరుగులు చేసి చివరి ఏడు వికెట్లు కోల్పోయింది. దీంతో నాలుగు టెస్టుల సిరీస్‌ను భారత్‌ 1-1తో సమం చేసింది.

అశ్విన్‌.. లారెన్స్‌(26)ను బోల్తా కొట్టించడంతో ఇంగ్లాండ్‌ వికెట్ల పతనం మొదలవగా.. కెప్టెన్‌ జోరూట్‌(33; 92 బంతుల్లో 3×4) వికెట్‌ కాపాడుకునే ప్రయత్నం చేసినా ధాటిగా పరుగులు చేయలేకపోయాడు. ఈ క్రమంలోనే బెన్‌స్టోక్స్‌(8), ఓలీపోప్‌(12), బెన్‌ ఫోక్స్‌(2) వరుసగా విఫలమయ్యారు. దాంతో ఇంగ్లాండ్‌ భోజన విరామ సమయానికే 116/7తో ఓటమికి చేరువైంది.

రెండో సెషన్‌లో ఇంగ్లాండ్‌ను ఆలౌట్‌ చేయడానికి భారత్‌కు ఎక్కువ సమయం పట్టలేదు. అక్షర్‌ వరుస ఓవర్లలో రూట్, స్టోన్‌ను(0) ఔట్‌ చేయడంతో ఇంగ్లాండ్‌ ఓటమి లాంఛనమే అయింది. అయితే, చివర్లో మొయిన్‌ అలీ(43; 18 బంతుల్లో 3×4, 5×6) సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. బ్రాడ్‌తో కలిసి పదో వికెట్‌కు 38 పరుగులు జోడించాడు. ఈ క్రమంలోనే అర్ధశతకానికి చేరువైన అతడు కుల్‌దీప్‌ బౌలింగ్‌లో ఫ్రంట్‌ఫుట్‌ వచ్చి షాట్‌ ఆడేందుకు యత్నించగా స్టంపౌటయ్యాడు. దాంతో ఇంగ్లాండ్‌ 164 పరుగులకు ఆలౌటైంది.