Army New Uniform : ఆర్మీ కొత్త యూనిఫామ్ తయారీ కాంట్రాక్టుపై రాద్దాంతం..మాకే ఇవ్వాలంటున్నOCF

ఆర్మీ కొత్త యూనిఫామ్ తయారీ కాంట్రాక్టు రగడగా మారింది. యూనిఫాం కాంట్రాక్ట్ కోసం పలు సంస్థలు పోటీ పడుతున్నాయి. కానీ ఈ కాంట్రాక్ట్ మాకే ఇవ్వాలంటున్నOCF డిమాండ్ చేస్తోంది.

Army New Uniform : ఆర్మీ కొత్త యూనిఫామ్ తయారీ కాంట్రాక్టుపై రాద్దాంతం..మాకే ఇవ్వాలంటున్నOCF

Army New Uniform

Army New Uniform : ఇండియన్ ఆర్మీకి కొత్త యూనిఫామ్ రానుంది. జనవరి 15న ఆర్మీ డేను పురస్కరించుకుని నేడు ఆవిష్కరించనున్నారు. కొత్త డిజిటల్ ప్యాటర్న్ బ్యాటిల్ యూనిఫామ్‌ను ఆవిష్కరించనున్నారు. ఇదిలా ఉంటే ఆర్మీ యూనిఫాం తయారీ విషయంలో రగడ రాజుకుంది. ఆర్మీకి తయారు చేసే కొత్త యూనిఫాం తయారీ కాంట్రాక్టు విషయమై రాద్ధాంతం అవుతోంది. కొత్త డిజైన్ తో యూనిఫామ్ ను అమల్లోకి తీసుకురావాలని ఆర్మీ నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో తయారీ కాంట్రాక్టును తమకే ఇవ్వాలని ఆర్డినెన్స్ క్లాతింగ్ ఫ్యాక్టరీలు (OCF) డిమాండ్ చేస్తున్నాయి.

నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ (నిఫ్ట్) సంస్థ సహకారంతో రూపొందించిన కొత్త యూనిఫామ్ ను ఈ నెల 15న ఆర్మీడే సందర్భంగా ప్రదర్శించారు. ప్రస్తుత యూనిఫామ్ వలెనే కనిపించినా..కొత్త యూనిఫాంలో కొత్తదనం మాత్రం ఉందనే చెప్పాలి. 13 లక్షల మంది సైనికులకు యూనిఫామ్ ను అందించాల్సిన యూనిఫాం కాంట్రాక్టు పొందటానికి ఆయా సంస్థలు పోటీ పడుతున్నాయి. ఎందుకంటే ఇది భారీ కాంట్రాక్టు కానుంది.అలా ఆర్మీ యూనిఫాం కాంట్రాక్టు కోసం పలు సంస్థలు పోటీ పడుతున్నాయి.

Also Read : New Uniform : ఇండియన్ ఆర్మీకి కొత్త యూనిఫామ్

దీంతో ఆర్మీ బహిరంగ టెండర్ ను పిలిచి, తక్కువ ధరకు కోట్ చేసిన సంస్థకు టెండర్ ఇవ్వాలని యోచిస్తోంది. ఖర్చు తక్కువ అవ్వాలి. అదేసయమంలో యూనిఫాం చక్కటి క్వాలిటీ కలిగి ఉండాలి. ధరించటానికి సౌకర్యంగా ఉండాలి. తక్కువ ధరకు కోట్ చేసిన సంస్థకు కాంట్రాక్టు ఇస్తే వ్యయం తగ్గుతుందని ఆర్మీ భావిస్తోంది. దీన్ని ఆర్డినెన్స్ క్లాతింగ్ ఫ్యాక్టరీలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలతో పోలిస్తే ప్రైవేటు కంపెనీల పట్ల ఆర్మీ, కేంద్రాలు అనుకూలంగా ఉన్నాయంటూ ఆవాడి ఫ్యాక్టరీ ఆరోపించింది. ఆర్డినెన్స్ క్లాతింగ్ ఫ్యాక్టరీలు మనుగడ సాగించాలంటే ఆర్డర్లు చాలా అవసరమని, పోరాట దళాల యూనిఫామ్ ల తయారీలో వాటికి మంచి అనుభవం ఉందని ఆర్డినెన్స్ క్లాతింగ్ ఫ్యాక్టరీ ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి.

కాగా ఈ కొత్త యూనిఫాం తేలికగా, పర్యావరణానికి అనుకూలమైనదిగా ఉండనుంది. కొత్తగా తీసుకొస్తున్న యూనిఫాం “డిజిటల్” నమూనాను కలిగి ఉంటుంది. ఆర్మీ యూనిఫామ్ ను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) రూపొందించింది. యూఎస్ ఆర్మీ యూనిఫామ్ తరహాలో భారత ఆర్మీ కొత్త యూనిఫామ్ ఉండనుంది. గత ఆర్మీ కమాండర్స్ కాన్ఫరెన్స్‌లో కొత్త ఆర్మీ యుద్ధ సామగ్రిని ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఆధునిక ఆర్మీ యూనిఫామ్ ప్రస్తుత దుస్తుల నుండి పూర్తిగా భిన్నంగా ఉంటాయి. భారత ఆర్మీ దళాలు తమ షర్టులను టక్ చేయాల్సిన అవసరం లేదు.

Also Read : Winter Storm Izzy In US: అమెరికాను వణికిస్తున్న ఇజ్జీ..190 కి.మీ వేగంతో విరుచుకుపడ్డ టోర్నడో

కొత్త దుస్తులలో మట్టి రంగు, ఆలివ్‌తో సహా అనేక రకాల రంగులు ఉన్నాయి.ఈ యూనిఫామ్‌ను స్వదేశీ టెక్నాలజీతో, స్వదేశీ సంస్థలు సిద్ధం చేశాయి. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ద్వారా ఆర్మీతో సన్నిహిత సహకారంతో రూపొందించబడింది. యూనిఫామ్, సైనికులకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా చూడడమే కొత్త ఆర్మీ యూనిఫామ్ లక్ష్యంగా ఉంది.