New Uniform : ఇండియన్ ఆర్మీకి కొత్త యూనిఫామ్

కొత్తగా తీసుకొస్తున్న యూనిఫాం “డిజిటల్” నమూనాను కలిగి ఉంటుంది. ఆర్మీ యూనిఫామ్ ను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) రూపొందించింది.

New Uniform : ఇండియన్ ఆర్మీకి కొత్త యూనిఫామ్

Indian Army 11zon

New uniform for Army : ఇండియన్ ఆర్మీకి కొత్త యూనిఫామ్ రానుంది. జనవరి 15న ఆర్మీ డేను పురస్కరించుకుని నేడు ఆవిష్కరించనున్నారు. కొత్త డిజిటల్ ప్యాటర్న్ బ్యాటిల్ యూనిఫామ్‌ను ఆవిష్కరించనున్నారు. ఇది తేలికగా, పర్యావరణానికి అనుకూలమైనదిగా ఉంటుంది. కొత్తగా తీసుకొస్తున్న యూనిఫాం “డిజిటల్” నమూనాను కలిగి ఉంటుంది. ఆర్మీ యూనిఫామ్ ను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) రూపొందించింది. యూఎస్ ఆర్మీ యూనిఫామ్ తరహాలో భారత ఆర్మీ కొత్త యూనిఫామ్ ఉండనుంది.

గత ఆర్మీ కమాండర్స్ కాన్ఫరెన్స్‌లో కొత్త ఆర్మీ యుద్ధ సామగ్రిని ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఆధునిక ఆర్మీ యూనిఫామ్ ప్రస్తుత దుస్తుల నుండి పూర్తిగా భిన్నంగా ఉంటాయి. భారత ఆర్మీ దళాలు తమ షర్టులను టక్ చేయాల్సిన అవసరం లేదు.

PM Modi : నేడు స్టార్టప్‌ కంపెనీల ప్రతినిధులతో ప్రధాని మోదీ సమావేశం

కొత్త దుస్తులలో మట్టి రంగు, ఆలివ్‌తో సహా అనేక రకాల రంగులు ఉన్నాయి. ఈ యూనిఫామ్‌ను స్వదేశీ టెక్నాలజీతో, స్వదేశీ సంస్థలు సిద్ధం చేశాయి. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ద్వారా ఆర్మీతో సన్నిహిత సహకారంతో రూపొందించబడింది. యూనిఫామ్, సైనికులకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా చూడడమే కొత్త ఆర్మీ యూనిఫామ్ లక్ష్యంగా ఉంది.