ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు.. గిరిజన సంక్షేమ స్కూళ్లలో టీచర్ పోస్టుల అప్‌గ్రేడ్.. ఛైర్మన్లు, మెంబర్ల నియామకాలు..
పార్థసారథి తెలిపిన వివరాల ప్రకారం.. 44 అంశాలపై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించి ఆమోదం తెలిపింది.
AP Cabinet
AP Cabinet: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి వీటి వివరాలను మీడియాకు తెలిపారు.
పార్థసారథి తెలిపిన వివరాల ప్రకారం.. 44 అంశాలపై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించి ఆమోదం తెలిపింది. గిరిజన సంక్షేమ పాఠశాలల్లో 417 టీచర్ పోస్టులను అప్‌గ్రేడ్ చేసే ప్రతిపాదనకు ఆమోదముద్ర పడింది. (AP Cabinet)
సాంఘిక సంక్షేమం విభాగంలో సామాజిక సేవలో అనుభవం ఉన్న వ్యక్తులను చైర్మన్లు, మెంబర్లుగా నియమించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.
Also Read: ‘గోల్డ్ కార్డ్’ తీసుకుంటే మీకు అమెరికాలో ఏమేం దక్కుతాయంటే?
అమృత్ 2లో భాగంగా 2026 మార్చి 31లోగా పెండింగ్ పనులు ప్రారంభించాలని ఇటీవల కేంద్రం స్పష్టం చేసింది. దీంతో అమృత్ 2లో భాగంగా 506 పెండింగ్ ప్రాజెక్టులను రూ.9,613 కోట్ల నిధులతో చేపట్టేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ.163 కోట్లతో అమరావతిలో లోక్ భవన్ నిర్మాణానికి టెండర్లు పిలిచే ప్రతిపాదనలకు ఆమోద ముద్రపడింది.
ఎల్ 1 బిడ్లను ఆమోదించే బాధ్యతను సీఆర్డీఏ కమిషనర్‌కు అప్పగిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అమరావతిలో ఈ3 రోడ్డు విస్తరణకు ఎల్ 1 బిడ్ ఆమోదానికి అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీకి బాధ్యతలు అప్పగించింది. చిత్తూరు జిల్లా, కుప్పంలో పలార్ నదిపై చెక్ డ్యాం నిర్మాణానికి రూ.15.96 కోట్ల నిధులను పెంచే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.
రాష్ట్రంలో రెవెన్యూ రికార్డుల ట్యాంపరింగ్ విషయంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు సీఎం తెలిపారు. ఏడాది కాలంలోనే రెవెన్యూ సమస్యలన్నింటినీ పూర్తిగా పరిష్కరించాలని రెవెన్యూ విభాగానికి సీఎం ఆదేశించారు. 22ఏ, మ్యుటేషన్, రీ సర్వే సమస్యలన్నింటినీ పూర్తిగా పరిష్కరించాలని అన్నారు. ఆపై రెవెన్యూ రికార్డులన్నింటినీ బ్లాక్ చైన్ టెక్నాలజీ , క్లౌడ్ లో సేవ్ చేయాలని సీఎం ఆదేశించారు.తద్వారా రెవెన్యూ రికార్డులు ట్యాంపరింగ్ కాకుండా శాశ్వత పరిష్కారం కల్పించాలని అన్నారు.
