Redmi Note 14 Pro : సూపర్ డిస్కౌంట్ బ్రో.. ఈ రెడ్‌మి ప్రో ఫోన్ చాలా చీప్.. ఫ్లిప్‌కార్ట్‌లో ఇలా కొన్నారంటే.. డోంట్ మిస్..!
Redmi Note 14 Pro : కొత్త రెడ్‌మి స్మార్ట్‌ఫోన్ చౌకైన ధరకే లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో రూ.8వేల తగ్గింపుతో కొనుగోలు చేయొచ్చు.. ఈ అద్భుతమైన డీల్ అసలు మిస్ చేసుకోవద్దు.

Redmi Note 14 Pro : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తుంటే ఇది మీకోసమే.. రెడ్‌మి నోట్ 14 ప్రో అతి తక్కువ ధరకే లభిస్తోంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 8వేల కన్నా ఎక్కువ తగ్గింపుతో అమ్ముడవుతోంది. మీరు బ్యాంక్ ఆఫర్లతో మరిన్ని డిస్కౌంట్‌లను పొందవచ్చు.

ఈ రెడ్‌మి నోట్ 14 ప్రో ఫోన్‌ను మీ బడ్జెట్ ధరలోనే కొనేసుకోవచ్చు. రెడ్‌మి నోట్ 14 ప్రో మోడల్ 3 రియర్ కెమెరాలు, అమోల్డ్ డిస్‌ప్లే, 5,500mAh బ్యాటరీతో వస్తుంది. మీకు ఆసక్తి ఉంటే ఫ్లిప్‌కార్ట్‌లో రెడ్‌మి నోట్ 14 ప్రో డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఫ్లిప్‌కార్ట్‌లో రెడ్‌మి నోట్ 14 ప్రో డీల్ : సాధారణంగా దాదాపు రూ.28,999కి అమ్ముడవుతున్న రెడ్‌మి నోట్ 14 ప్రో ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.20,897కి లిస్ట్ అయింది. తద్వారా మీకు రూ.8,102 తగ్గింపు లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ లేదా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో కొనుగోలుదారులు రూ.4వేల వరకు అదనంగా 5శాతం క్యాష్‌బ్యాక్‌ను కూడా పొందవచ్చు.

ప్రస్తుత ధర రూ.16,897కి తగ్గుతుంది. మీరు ఈఎంఐతో చెల్లించాలనుకుంటే, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ నెలకు రూ.737 నుంచి నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అందిస్తోంది. మీరు పాత ఫోన్ నుంచి అప్‌గ్రేడ్ చేస్తుంటే ఫ్లిప్‌కార్ట్ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. మీ పాత ఫోన్, మోడల్, వర్కింగ్ కండిషన్ బట్టి గరిష్టంగా రూ.20,210 ఎక్స్ఛేంజ్ వాల్యను పొందవచ్చు.

రెడ్‌మి నోట్ 14 ప్రో స్పెసిఫికేషన్లు : ఈ స్మార్ట్‌ఫోన్ 6.67-అంగుళాల 1.5K అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. అద్భుతమైన విజువల్స్, 120Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. రోజువారీ వినియోగానికి ఆకర్షణీయంగా ఉంటుంది. హుడ్ కింద, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్ట్రా చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. మల్టీ టాస్కింగ్, స్ట్రీమింగ్, గేమింగ్‌ను ఈజీగా ఆపరేట్ చేయొచ్చు.

కెమెరా విభాగంలో ట్రిపుల్-కెమెరా సెటప్ కలిగి ఉంది. అద్భుతమైన షాట్‌ల కోసం 50MP ప్రైమరీ లెన్స్, వైడ్ విజువల్స్ కోసం 8MP అల్ట్రా-వైడ్, క్లోజప్ షాట్‌ల కోసం 2MP మాక్రో కెమెరా ఉన్నాయి. అంతేకాదు.. ఈ స్మార్ట్‌ఫోన్ 5,500mAh బ్యాటరీతో వస్తుంది. 45W ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. డిస్‌ప్లే ప్రొటెక్షన్ కోసం గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ఉపయోగిస్తుంది. ప్రమాదవశాత్తు పడిపోయినా గీతలు పడవు. ఎక్కువ కాలం మన్నికను అందిస్తుంది.
