Tax Refund Status : మీ TAX రీఫండ్ ఇంకా రాలేదా? ITR ఫైలింగ్‌లో అందరూ చేసే కామన్ మిస్టేక్స్ ఇవే.. అర్జెంట్‌గా ఇలా కరెక్ట్ చేసుకోండి..!
Tax Refund Status : ఐటీఆర్ దాఖలు చేసినా రీఫండ్ రాలేదా? అయితే, మీరు ఐటీఆర్ ఫైలింగ్ సమయంలో ఈ తప్పులు చేసి ఉండొచ్చు. వెంటనే కరెక్ట్ చేసుకోండి.. ఇదిగో సింపుల్ ప్రాసెస్..
Tax Refund
Tax Refund Status : టాక్స్ పేయర్లకు బిగ్ అలర్ట్.. మీ ఐటీఆర్ దాఖలు చేసినప్పటికీ ఇంకా రీఫండ్ రాలేదా? డోంట్ వర్రీ.. మీ రీఫండ్ రాకపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. దేశవ్యాప్తంగా లక్షలాది మంది పన్ను చెల్లింపుదారులు చాలా నెలలుగా తమ ఐటీఆర్ రీఫండ్స్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు.
సెప్టెంబర్ 16 గడువు తర్వాత చాలా రిటర్న్‌లు ప్రాసెస్ (Tax Refund Status) అయినప్పటికీ కూడా అందులో ఎక్కువ మొత్తం ఇప్పటికీ రీఫండ్ అందుకోలేదు. ఇప్పటికీ టాక్స్ పేయర్లు ఐటీ పోర్టల్‌ను పదేపదే చెక్ చేస్తున్నారు. తమ ఫైలింగ్‌లను తిరిగి పరిశీలిస్తున్నారు. రీఫండ్ ఎందుకు ఆలస్యం అవుతుంది? అసలు కారణాలేంటి? రీఫండ్ వచ్చేందుకు ఎంత సమయం పడుతుంది? అనేది పూర్తి వివరాలతో ఇప్పుడు తెలుసుకుందాం..
రీఫండ్ ఎప్పుడు వస్తుందంటే? :
ఆదాయపు పన్ను శాఖ నిబంధనల ప్రకారం.. ఐటీఆర్ ఇ-వెరిఫై తర్వాత మాత్రమే రీఫండ్ ప్రాసెస్ అవుతుంది. ఇ-వెరిఫికేషన్ తర్వాత రీఫండ్ సాధారణంగా 4 వారాల నుంచి 5 వారాలలోపు బ్యాంకు అకౌంట్లలో డిపాజిట్ అవుతుంది. చాలా మంది పన్ను చెల్లింపుదారులు ఈ సమయ వ్యవధిలోపు తమ డబ్బును అందుకుంటారు. అయితే, ఆలస్యమైన రీఫండ్‌కు అనేక సాధారణ కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
ITR రీఫండ్ ఎందుకు నిలిచిపోయింది? :
- బ్యాంక్ అకౌంట్ చెల్లదు : రీఫండ్‌లు వ్యాలీడ్ అయ్యే బ్యాంక్ అకౌంట్లలో మాత్రమే డిపాజిట్ అవుతాయి. రాంగ్ అకౌంట్ నంబర్, రాంగ్ IFSC కోడ్ లేదా వ్యాలీడ్ కాని అకౌంటులో రీఫండ్ ప్రాసెస్ నిలిచిపోతుంది.
- పాన్, బ్యాంక్ వివరాలు మిస్ మ్యాచింగ్ : మీ బ్యాంక్ అకౌంటులోని పేరు పాన్ కార్డుతో సరిపోలకపోతే సిస్టమ్ రీఫండ్ బ్లాక్ చేస్తుంది.
- పాన్-ఆధార్ లింక్ : డిపార్ట్‌మెంట్ ప్రకారం.. మీ పాన్ వర్క్ చేయకపోతే మీ రీఫండ్ ఫెయిల్ అవుతుంది.
- తప్పుడు డెడిక్షన్ క్లెయిమ్‌లు, హై వాల్యూ రీఫండ్ : కొన్ని రీఫండ్స్ హై వాల్యూ లేదా “రెడ్-ఫ్లాగ్డ్” కేటగిరీలో ఉండొచ్చు. అదనపు రివ్యూ కోసం పెండింగ్ లో చూపిస్తుంది.
- ఫారం 16, 26AS AIS మిస్ మ్యాచింగ్ : మీ ఆదాయం, టీడీఎస్ లేదా ఇతర వివరాలు ఈ మూడింటిలోనూ సరిపోలకపోతే కేసు మాన్యువల్ రివ్యూలోకి వెళుతుంది. తద్వారా రీఫండ్ నిలిచిపోతుంది.
రీఫండ్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి? :
- అధికారిక వెబ్‌సైట్ eportal.incometax.gov.in విజిట్ చేయండి.
- ముందుగా మీ వివరాలతో లాగిన్ అవ్వండి.
- e-File >> Income Tax Returns >> View Filed Returns
- Assessment Year ఎంచుకుని View Details ఆప్షన్ ఓపెన్ చేయండి.
- రీఫండ్ జారీ అయిందా? రివ్యూలో ఉందా లేదా ఏదైనా మరింత సమాచారం అవసరమా అనేది తెలుసుకోవచ్చు.
రీఫండ్ ఎప్పుడు వస్తుంది? :
మీరు అందించిన డేటా సరైనది అయితే వారికి 4 నుంచి 5 వారాలలోపు రీఫండ్ వస్తుంది. అయితే, డాక్యుమెంట్లు లేదా బ్యాంక్ సమాచారం తప్పుగా ఉన్నవారు లేదా రీఫండ్ హై వాల్యూ కేటగిరీలో ఉన్నవారికి ప్రాసెసింగ్ టైమ్ ఎక్కువ ఉండొచ్చు.
పన్నుచెల్లింపుదారులు ఏం చేయాలంటే? :
- బ్యాంక్ అకౌంట్ వెరిఫై చేయండి.
- పాన్-ఆధార్ లింక్‌ను చెక్ చేయండి.
- ఫారం 26AS, AIS, ITR మ్యాచ్ వివరాలు చెక్ చేయండి.
- మీకు ఐటీ నోటీసులు అందితే వెంటనే స్పందించండి.
