Sputnik-V Vaccine : భారత్‌లోకి మరో వ్యాక్సిన్..

భారత్‌లో క‌రోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో మరో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేసింది.

Sputnik-V Vaccine : భారత్‌లోకి మరో వ్యాక్సిన్..

India Gives Green Signal To Russian Vaccine Sputnik V

Sputnik-V Vaccine : భారత్‌లో కరోనా కేసుల తీవ్రత పెరుగుతోంది. రోజురోజుకీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ డోసుల కొరత కొన్నిచోట్ల ఎదుర్కోవాల్సి వస్తోంది. కరోనా కేసులు వేగంగా పెరిగిపోతుండటంతో అదే స్థాయిలో వ్యాక్సినేషన్ కూడా పెరగాల్సిన అవసరం ఉంది. కరోనా వ్యాక్సినేషన్ కొరతను అధిగమించేందుకు వ్యాక్సిన్ ఉత్పత్తిని వేగవంతం చేస్తోంది ప్రభుత్వం.

ఇప్పటికే భారత్ లో రెండు కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి రాగా.. ఇప్పుడు మరో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేసింది. ఈ నేపథ్యంలో దేశంలో మరో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేసింది. రష్యా వ్యాక్సిన్ అయిన Sputnik-V టీకాకు భారత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. రష్యా వ్యాక్సిన్‌కు డీసీజీఐ ఆమోదం తెలిపింది.