Coronavirus: కాస్త ఊరట.. భారత్‌లో స్వల్పంగా తగ్గిన కొవిడ్ కేసులు

భారత్‌లో కొవిడ్ కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. గత నాలుగు రోజులుగా 3వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కాగా మంగళవారం కొత్త కొవిడ్ కేసుల సంఖ్య తగ్గుముఖం...

Coronavirus: కాస్త ఊరట.. భారత్‌లో స్వల్పంగా తగ్గిన కొవిడ్ కేసులు

Covid 19 Cases

Coronavirus: భారత్‌లో కొవిడ్ కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. గత నాలుగు రోజులుగా 3వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కాగా మంగళవారం కొత్త కొవిడ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. దేశవ్యాప్తంగా కొత్తగా 2,568 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 20మంది కొవిడ్ తో చికిత్స పొందుతూ మృతిచెందారు.

Covid fourth wave: భారత్‪కు మరో వేవ్ తప్పదా?

ప్రస్తుతం దేశంలో యక్టీవ్ కేసుల సంఖ్య 19,137కి(పాజిటివిటీ రేటు 0.04 శాతం) చేరుకుంది. దేశంలో ఇప్పటి వరకు 4,30,84,913 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. అయితే ఇప్పటి వరకు 5,23,889 మరణాలు సంభవించాయి. దేశంలో రికవరీ రేటు 98.74శాతంగా నమోదైంది. సోమవారం ఒక్కరోజు కొవిడ్ తో చికిత్స పొందుతున్న వారు 2,911 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,25,41,887కి చేరుకుంది.

Telangana Covid : తెలంగాణలో కరోనా.. కొత్త కేసులు

ఇదిలా ఉంటే .. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం.. దేశంలో ఇప్పటి వరకు కరోనా నిర్ధారణ పరీక్షలు 83.86కోట్లు దాటాయి. గడిచిన 24 గంటల్లో 4,19,552 మందికి టెస్టులు నిర్వహించారు. దేశవ్యాప్తంగా 3,365 ల్యాబ్స్ లో కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే కొవిడ్ వ్యాప్తి నివారణ కోసం దేశవ్యాప్తంగా కొవిడ్ టీకా పంపిణీ కార్యక్రమం ముమ్మరంగా సాగుతుంది. దేశంలో 473 రోజులుగా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 189.41 డోసుల టీకాలు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అందజేశారు.