India vs England : చేతులేత్తిసిన టీమిండియా, ఇంగ్లండ్ ఘన విజయం

ఇంగ్లండ్ తో జరిగిన మూడో టెస్టులో భారత్ ఓటమి పాలైంది. ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో ఇంగ్లండ్ గెలుపొందింది. భారత్ టాప్ ఆర్డర్ రాణించినా.. మిడిల్ ఆర్డర్ బ్యాట్ మెన్స్ చేతులెత్తేశారు.

India vs England : చేతులేత్తిసిన టీమిండియా, ఇంగ్లండ్ ఘన విజయం

India

India vs England, 3rd Test : ఇంగ్లండ్ తో జరిగిన మూడో టెస్టులో టీమిండియా పరాజయం పాలైంది. రెండో ఇన్నింగ్స్ లో 278 పరుగులకు ఆలౌటైంది. దీంతో 76 రన్ల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. సిరీస్ ను 1-1 సమం చేసింది. భారత్ టాప్ ఆర్డర్ రాణించినా..అదే కంటిన్యూ చేయలేకపోయారు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్స్. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి చేతులెత్తేశారు.

Read More : Space Pens : నిజమేనా? అంతరిక్షంలో అస్ట్రోనాట్లు ఎలా రాస్తారు?

తొలుత 212/2 ఓవర్ నైట్ స్కోర్ తో శనివారం నాలుగో రోజు ఆట ప్రారంభించింది టీమిండియా. అయితే..తొలి సెషన్ లోనే 8 వికెట్లు కోల్పోయింది. మంచి ఊపు మీదుంటూ..సెంచరీ దిశగా దూసుకెళుతున్న పుజారా (91) రాబిన్ సన్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ (55)..రాణించాడు. కాసేపటికే రాబిన్ సన్ బౌలింగ్ లోనే స్లిప్ లో రూట్ చేతికి చిక్కాడు.

Read More :Gokulashtami : తిరుమలలో గోకులాష్టమి, ఉట్లోత్సవం..ఏర్పాట్లు

అప్పటికీ భారత్ స్కోరు 237/4. తర్వాత వచ్చిన బ్యాట్స్ మెన్ ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. రహానే (10), పంత్ (1), షమి (6), ఇషాంత్ (2), జడేజా (30), సిరాజ్ (0) వెనుదిరిగారు. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి భారత బ్యాట్స్ మెన్ చేతులెత్తేశారు. కనీసం పోరాట చేయలేదు. దీంతో టపటపా వికెట్లు పడిపోయాయి. ప్రధానంగా రాబిన్ సన్ 5 వికెట్లు తీసుకుని ముప్పుతిప్పలు పెట్టాడు. దీంతో తప్పుడు అంచనాలు వేస్తూ..క్యాచ్ లు సమర్పించుకున్నారు. చివరకు భారత్ 99.3 ఓవర్లలో 278 పరుగులకు ఆలౌట్ అయ్యింది. రాబిన్ సన్ 5 వికెట్లు తీయగా..ఓవర్టన్ మూడు వికెట్లు, అండర్సన్, మొయిన్ ఆలీ చెరో వికెట్ తీశారు.

Read More : బాయ్ ఫ్రెండ్ బ్రేకప్ చెప్పాడని..తనను తానే పెళ్లి చేసుకున్న అందాల భామ

భారత్ మొదటి ఇన్నింగ్స్ 78, రెండో ఇన్నింగ్స్ 278.
ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్ 432 పరుగులు.