Indian Cricket: ”టీమిండియా డైట్‌లో పోర్క్, బీఫ్ ఎందుకుండదు?”

రిక్వైర్మెంట్స్ మెనూల్లో కేవలం హలాల్ మీట్ మాత్రమే ఉండాలని పోర్క్, బీఫ్ లాంటివి ఏ రకంగా వండినా ఉంచే ప్రసక్తే లేదంటూ టీమిండియా డైటరీ ప్లాన్ లో పేర్కొన్నారు. పైగా ఫుడ్ కచ్చితంగా హలాల్

Indian Cricket: ”టీమిండియా డైట్‌లో పోర్క్, బీఫ్ ఎందుకుండదు?”

Bcci

Indian Cricket: టీమిండియా క్రికెట్ మేనేజ్మెంట్ పై పలువురు నెటిజన్ల కామెంట్లు చర్చనీయాంశంగా మారాయి. భారత పర్యటనలో ఉన్న న్యూజిలాండ్ ఇప్పటికే టీ20 సిరీస్ ను పూర్తి వైఫల్యంతో ముగించింది. ఇక 25వ తేదీ నుంచి జరిగే టెస్టు సిరీస్ కు సిద్ధమవుతుండగా.. ఇరుజట్ల డైటింగ్ ప్లాన్ గురించి చర్చ జరుగుతుంది.

రిక్వైర్మెంట్స్ మెనూల్లో కేవలం హలాల్ మీట్ మాత్రమే ఉండాలని పోర్క్, బీఫ్ లాంటివి ఏ రకంగా వండినా ఉంచే ప్రసక్తే లేదంటూ టీమిండియా డైటరీ ప్లాన్ లో పేర్కొన్నారు. పైగా ఫుడ్ కచ్చితంగా హలాల్ అయి ఉండటం ఇంపార్టెంట్ అని రాశారు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. టీమ్ మేనేజ్మెంట్ ప్లేయర్ల తిండిపై ఎందుకు నిబంధనలు విధిస్తుందంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

బీసీసీఐని తిట్టిపోస్తుండగా.. అసలు డైటరీ ప్లాన్ అనేది బీసీసీఐ నుంచి రాదని కేవలం హోస్ట్ గా మాత్రమే ఉంటుందని కన్వే చేస్తున్నారు ఇంకొందరు. దాదాపు ఎటువంటి మేజర్ టీం అయినప్పటికీ పర్యటనల్లో ఉన్నప్పుడు హలాల్ ఆహారం కచ్చితంగా ఉండాలి. ఎందుకంటే జట్లలో కనీసం ఒక్కరైనా ముస్లిం ప్లేయర్ ఉంటారని ఆ నిర్ణయం తీసుకుంటారు.

……………………………………………. : పంజాబ్ లో ఆటో డ్రైవర్ ఇంటికెళ్లి భోజనం చేసిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌..

కాకపోతే కాన్పూర్ లో జరిగే టెస్టు మ్యాచ్ కు న్యూజిలాండ్ అనౌన్స్ చేసిన డైటరీ ప్లాన్ ఇక్కడ వివాదానికి కారణమైంది. కివీస్ ఆటగాళ్లలో కొందరు ఆటగాళ్లు ఫాలో అయ్యే లంచ్ బ్రేక్ స్పెషల్ డైట్ ఇలా ఉంది.
* బీఫ్ లేదా గొర్రె మాంసం
* చికెన్, చేప లేదా పోర్క్
* కార్బొహైడ్రేట్స్ కోసం, బంగాళదుంపలు, అన్నం, పిస్తా
* కూరగయాలు + సలాడ్, ఫ్రూట్

‘కార్బొహైడ్రేట్, ప్రొటీన్ లతో పాటు కొవ్వు తక్కువ స్థాయిలో ఉండే వాటికే ప్రాధాన్యత ఇస్తారు. గేమ్ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు అథ్లెట్ల కోసం ఇటువంటి కీలక అంశాలు కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలి. ఇక ఫుడ్ దాదాపు నేచురల్ ప్రొడక్ట్స్ నుంచే తయారుచేయాలి’ అని డైటరీ ప్లాన్ చెప్తుంది.

…………………………………… : ఏఐఏహెచ్ ఎల్ లో ఉద్యోగాల భర్తీ