WWE Veer Mahan: WWEలో సత్తా చాటుతున్న భారత వీరుడు: ఈ వీర్ మహాన్ ఎవరు?

"వీర్ మహాన్" ప్రస్తుతం wweలో పంబరేపుతున్న భారతీయుడు. WWE పోటీల విషయంలో ఇటీవల సోషల్ మీడియాలో బాగా ట్రేండింగ్ లో ఉన్న పేరు.

WWE Veer Mahan: WWEలో సత్తా చాటుతున్న భారత వీరుడు: ఈ వీర్ మహాన్ ఎవరు?

Veermahan

WWE Veer Mahan: WWE గురించి తెలియనివారుండరు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పాపులర్ అయిన ఈ కుస్తీ పోటీలు ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. శారీరక దృఢత్వం కలిగిన మల్లయోధులు..నాటకీయంగా, ఎంతో రక్తికట్టిస్తూ కుస్తీ పోటీల్లో పాల్గొనడమే ఈ WWE కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణ. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది యోధులు ఈ WWE వేదికగా సూపర్ స్టార్లుగా ఎదిగారు. మన భారత దేశం నుంచి “ది గ్రేట్ ఖలీ”(దలీప్ సింగ్ రానా) కూడా WWEలో ఎంతో పేరు గడించి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ఆయన తరువాత చెప్పుకోదగ్గ స్థాయిలో మరో భారతీయుడు ఈ WWEలో మెరిసింది లేదు. అయితే ఇన్నాళ్లకు మరో భారతీయుడు WWEలో సత్తా చాటుతున్నారు. “వీర్ మహాన్” ప్రస్తుతం wweలో పంబరేపుతున్న భారతీయుడు. WWE పోటీల విషయంలో ఇటీవల సోషల్ మీడియాలో బాగా ట్రేండింగ్ లో ఉన్న పేరు. ఈ ఏడాది ఏప్రిల్లో ‘WWE Raw’లో చేరిన వీర్ మహాన్..కేవలం 25 రోజుల వ్యవధిలోనే తన పవర్ ఏంటో చూపించాడు. ఏప్రిల్ 4న నరిగిన ఒక పోటీలో తండ్రీకొడుకులైన రే మిస్ట్రియో, డొమినిక్ మిస్ట్రియోలతో వీర్ మహన్ తలపడి వారిని చిత్తు చిత్తు చేశాడు. ఈ మహా వీరుడు రింగులోకి దిగాడంటే..స్టేడియం హోరెత్తిపోవాల్సిందే. దీంతో వీర్ మహాన్ పేరు ఒక్కసారిగా మారుమ్రోగిపోయింది. అతని గురించి అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిపారు.

Also read:Thinking Too Much : అతిగా ఆలోచిస్తున్నారా! ఆరోగ్యం రిస్క్ లో పడే ప్రమాదం ఉంది.

వీర్ మహాన్ నేపధ్యం:
మరి స్వల్ప వ్యవధిలోనే ఈ స్థాయికి చేరుకున్న వీర్ మహాన్ నేపధ్యం ఏమిటి?. వీర్ మహాన్ అసలు పేరు రింకు సింగ్ రాజ్‌పుత్. ఉత్తర్‌ప్రదేశ్‌లోని రవిదాస్ నగర్ జిల్లాలో గోపిగంజ్‌ అనే చిన్న గ్రామంలో పుట్టాడు రింకు. ఆయన తండ్రి ఓ లారీ డ్రైవర్‌. మొత్తం మంది సంతానంలో రింకు ఒకడు. ప్రస్తుతం రింకు సింగ్ కుటుంబం గోపిగంజ్‌లోనే నివసిస్తుంది. చిన్నప్పటి నుంచి ఆటల్లో ముందుండే రింకు సింగ్..చదువుకునే రోజుల్లో జావెలిన్ త్రో ఆడేవాడు. లక్నోలోని గురుగోవింద్ సింగ్ స్పోర్ట్స్ కాలేజీలో చదువుతున్న సమయంలోనే 2008లో ‘ది మిలియన్ డాలర్ ఆర్మ్’ అనే టీవీ రియాలిటీ షోలో పాల్గొన్నాడు రింకు సింగ్. ఇదొక బేస్‌బాల్ టాలెంట్ హంట్ షో. ఇందులో వేగంగా బాల్ విసరగలిగేళ్లు చాలామంది పాల్గొన్నారు. అమెరికా వంటి దేశాల్లో ఎంతో పాపులర్ ఈ బేస్ బాల్ ఆట. టీవీ రియాలిటీ షోలో పాల్గొన్న రింకు సింగ్ గంటకు 140 కిమీ వేగంతో బంతి విసిరి నంబర్ వన్‌గా నిలిచాడు.

Also read:Sister Andre : ‘రోజూ వైన్ తాగ‌డం వ‌ల్లే 118 ఏళ్లు ఆరోగ్యంతో ఉన్నా’..

బేస్‌బాల్ ఆటలో సత్తా చాటిన వీర్:
ధృడమైన శరీరం, వేగం కారణంగా ఈ పోటీలో విజేతగా నిలిచాడు రింకు సింగ్. అనంతరం బేస్ బాల్ ఆటపై ఆసక్తి పెంచుకున్న అతను ఆట కోసం అమెరికా వెళ్లాడు. కొన్ని బేస్‌బాల్ జట్లతో పలు పోటీల్లో పాల్గొన్న అనంతరం రింకు ఆట తీరు నచ్చిన పీటర్స్‌బర్గ్ పైరేట్స్‌ జట్టు అతనితో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ జట్టు తరుపున 2009 – 2016 మధ్య ప్రపంచవ్యాప్తంగా అనేక బేస్‌బాల్ పోటీల్లో పాల్గొన్నాడు రింకు. 2018లో బేస్‌బాల్ ఆటకు వీడ్కోలు పలికిన రింకు సింగ్..అనంతరం ప్రొఫెషనల్ రెజ్లింగ్‌ వైపు అడుగులేసాడు. భారీ శరీరం, ఎన్నో హావభావాలను పలికిస్తున్న రింకుని చూసి WWE నిర్వాహకులు 2018లో అతనిని పోటీలోకి తీసుకున్నారు. WWEలోకి ఎంపికైన రింకు సింగ్ అక్కడ మరో భారత ఆటగాడు సౌరవ్ గుర్జార్‌తో జతకట్టి ‘ది ఇండస్ షేర్’ అనే జట్టును ఏర్పాటు చేశాడు. వీరితో పాటు జిందర్ మహల్ అనే ఆటగాడు కూడా తోడవడంతో..WWE NXTలో పాల్గొన్నారు.

Also read:Coronavirus China: షాంఘైను వీడుతున్నరు.. పెరుగుతున్న కొవిడ్ కేసులతో ఇతర ప్రాంతాలకు ప్రజలు..

WWEలో భారత్ పేరు నిలబెట్టిన వీర్:
వీర్, షాంకీ, జిందర్‌ల జట్టు వరుసగా 12 మ్యాచ్‌ల్లో ప్రత్యర్థులను చిత్తు చేశారు. మొదట్లో తన అసలు పేరుతోనే WWEలో పాల్గొన్న రింకు సింగ్..తరువాత తన పేరును వీర్‌గా మార్చుకున్నాడు. అయితే అనుకోని కారణాల వలన 2021లో ‘ది ఇండస్ షేర్’ జట్టు నుంచి విడిపోయిన సింకు సింగ్ అలియాస్ వీర్ ఆతరువాత స్వతంత్ర రెజ్లర్‌గా WWE Rawతో డీల్ కుదుర్చుకున్నాడు. ఇందులోకి రావడంతోనే తన పేరును వీర్ మహాన్‌గా మార్చుకున్నాడు. 2021 అక్టోబర్ లోనే WWE Raw మ్యాచుల్లో పాల్గొనాల్సిన వీర్ మహాన్..అనుకోని కారణాల వలన ఈ ఏడాది ఏప్రిల్లో రింగులోకి వచ్చాడు. రింగులోకి రావడంతోనే తన సత్తా చాటాడు వీర్ మహాన్. అయితే కొద్ది రోజుల్లోనే వీర్ మహాన్ ఇంత పాపులారిటీ సాధించడానికి ఒకటి తన ఆట కారణం అయితే మరొకటి వీర్ మహాన్ ఆహార్యం కారణంగా చెప్పవచ్చు. 6.4 అడుగుల ఎత్తు, 125 కిలోల బరువు, విశాలమైన ఛాతి, భుజాల వరకూ పెరిగిన జుట్టు, నల్లటి కళ్లు, పొడవాటి గడ్డం, నుదుటిపై శైవ నామాలతో గంభీరంగా కనిపిస్తాడు వీర్ మహాన్. పోటీ సమయంలో నల్లటి పంచలో భారతీయ కట్టుడు శైలిని తలపించేలా వీర్ మహాన్ ఎంతో ప్రత్యేకంగా నిలుస్తున్నాడు. అందుకే WWE రింగులో అతన్ని చూసిన వెంటనే మన భారతీయ అభిమానులు కెవ్వుకేక పెడుతున్నారు.