Indian Military : డ్రోన్ల వల్ల కలిగే ముప్పును నిరోధించేందుకు చర్యలు

డ్రోన్ల వల్ల కలిగే ముప్పును నిరోధించేందుకు చర్యలు తీసుకోవాలని భారత సైన్యం భావిస్తోంది. భవిష్యత్ ప్రణాళికలో దీనిని చేర్చాలని భారత సైన్యం చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ వెల్లడించారు. గురువారం ఆయన ఓ టీవీ ఛానల్ తో మాట్లాడారు. డ్రోన్లు అందుబాటులోకి రావడంతో భద్రతాపరమైన సవాళ్లు పెరుగుతున్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.

Indian Military : డ్రోన్ల వల్ల కలిగే ముప్పును నిరోధించేందుకు చర్యలు

Indian Miltary

Indian Military Drone : డ్రోన్ల దాడులతో భారతదేశం ఉలిక్కిపడుతోంది. ఇటీవలే జమ్ములో డ్రోన్లతో దాడులు జరిగిన సంగతి తెలిసిందే. దీంతో డ్రోన్ల వల్ల కలిగే ముప్పును నిరోధించేందుకు చర్యలు తీసుకోవాలని భారత సైన్యం భావిస్తోంది. భవిష్యత్ ప్రణాళికలో దీనిని చేర్చాలని భారత సైన్యం చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ వెల్లడించారు. గురువారం ఆయన ఓ టీవీ ఛానల్ తో మాట్లాడారు. డ్రోన్లు అందుబాటులోకి రావడంతో భద్రతాపరమైన సవాళ్లు పెరుగుతున్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే..ఇదొక కుటీర పరిశ్రమగా మారిపోయిందన్నారు.

కొత్త ముప్పుల విషయంలో దళాలకు అవగాహన కల్పించడం జరుగుతోందని, ముప్పును ధీటుగా ఎదుర్కొనడానికి కౌంటర్ డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించడంపై దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించారు. డ్రోన్లు, కౌంటర్ డ్రోన్ సిస్టమ్ లను దూకుడుగా దాడి చేయడానికి..ఆత్మరక్షణకు ఉపయోగించడంపై సైన్యం దృష్టి పెట్టిందన్నారు. ఆయుధాలను తిప్పికొట్టేందుకు తగిన సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకుంటున్నట్లు వెల్లడించారాయన. జమ్ములో భారత వాయుసేన స్థావరంపై జూన్ 27వ తేదీన డ్రోన్లతో దాడి జరిగింది. డ్రోన్లతో దాడులు జరగడం ఇదే తొలిసారి. పాక్ లోని లష్కరే తొయిబా, జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థల ప్రమేయం ఉందనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.