India Covid : భారత్‌‌లో కరోనా తగ్గుముఖం.. 32 రోజుల తర్వాత లక్షలోపు కేసులు

భారత దేశంలో కరోనా మెల్లిమెల్లిగా తగ్గుముఖం పడుతోంది. ప్రతి రోజు లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా 32 రోజుల తర్వాత...

India Covid : భారత్‌‌లో కరోనా తగ్గుముఖం.. 32 రోజుల తర్వాత లక్షలోపు కేసులు

India Corona

India’s Daily Cases Drop Below 1 Lakh : భారత దేశంలో కరోనా మెల్లిమెల్లిగా తగ్గుముఖం పడుతోంది. ప్రతి రోజు లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా 32 రోజుల తర్వాత లక్ష లోపు కేసులు రికార్డయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఓ ప్రకటన జారీ చేసింది. గత 24 గంటల్లో కొత్తగా 83 వేల 876 కేసులు నమోదు కాగా.. 895 మరణాలు సంభవించాయని వెల్లడించింది. కేరళలో కొత్తగా 378 మంది ఈ వైరస్ బారిన పడి చనిపోయారని తెలిపింది. ప్రస్తుతం దేశంలో 11, 08, 938 యాక్టివ్ కేసులుండగా 2.62 శాతంగా ఈ కేసులున్నాయని పేర్కొంది. 7.25 శాతానికి చేరుకున్న రోజువారీ పాజిటివిటి రేటు చేరుకోగా దేశంలో ఇప్పటివరకు 4,22,72,014 కేసులు నమోదయ్యాయి. 5,02,874 మరణాలు సంభవించాయి. దేశంలో 96.19 శాతంగా కరోన రికవరీ రేటు ఉంది. ఆదివారం కరోనా నుంచి 1,99,054 మంది కోలుకోవడం ఊరటనిచ్చే అంశం. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి 4,06,60,202 మంది కోలుకున్నారు.

Read More : Parliament Meetings: లతా మంగేష్కర్ కు పార్లమెంటులో నివాళి

మరోవైపు…భారత్ లో 388 రోజులుగా కరోనా వ్యాక్సినేషన్ వేగంగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 169.63 కోట్ల డోసుల టీకాలు అందచేశారు. ఆదివారం 14,70,053 డోసుల టీకాలు అందచేసినట్లు, ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 169,63,80,755 డోసుల టీకాలు అందచేయడం జరిగిందని కేంద్ర మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత్ లో 74.15 కోట్లు కరోన నిర్ధారణ పరీక్షలు దాటాయని ఐసీఎంఆర్ వెల్లడించింది.
గడిచిన 24 గంటల్లో 11,56,363 టెస్టులు నిర్వహించడం జరిగిందని,  దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 74,15,61,587 టెస్టులు జరపడం జరిగిందని తెలిపింది. దేశవ్యాప్తంగా 3255 లాబ్స్ లో కరోనా నిర్ధారణ పరీక్షలు
జరుగుతున్నాయని పేర్కొంది. కరోనా టెస్టుల కోసం దేశవ్యాప్తంగా ప్రజలకు 1411 ప్రభుత్వ లాబ్స్, 1844 ప్రైవేట్ లాబ్స్ అందుబాటులో ఉన్నాయని ఐసీఎంఆర్ వెల్లడించింది.