Indraja : తమ ప్రేమ గురించి బయటపెట్టిన ఇంద్రజ.. పెళ్లి ఖర్చు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

తాజాగా జబర్దస్త్ షోలో ఇంద్రజ తన పెళ్లి గురించి మాట్లాడింది. ఇటీవల రిలీజ్ అయిన ప్రోమోలో ఇంద్రజ మాట్లాడుతూ.. ''మాది ప్రేమ వివాహమే. మా పెళ్ళికి కేవలం 13 మంది అతిథులు మాత్రమే............

Indraja : తమ ప్రేమ గురించి బయటపెట్టిన ఇంద్రజ.. పెళ్లి ఖర్చు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

Indraja :  ఒకప్పుడు తెలుగు, తమిళ్, మలయాళం, హిందీలో సినిమాలు చేసి కొన్ని రోజులు టాప్ హీరోయిన్ గా ఉంది ఇంద్రజ. 2006లో నటుడు, బిజినెస్‌మెన్‌ మహమ్మద్‌ అబ్సర్‌ను పెళ్లి చేసుకొని సినిమాలకి దూరమైంది. పెళ్లి తర్వాత సినిమాలకి దూరమైనా ఇంద్రజ ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. బుల్లితెరపై షోలలో, సినిమాల్లో ఛాన్సులు వస్తుండటంతో మళ్ళీ బిజీగా మారింది. జబర్దస్త్ షో నుంచి రోజా వెళ్లిపోవడంతో ఇంద్రజ పర్మనెంట్ జడ్జిగా సెటిల్ అయిపోయింది.

Koffee with Karan : మాజీ ముఖ్యమంత్రి మనవళ్లు.. అన్నదమ్ములతో డేటింగ్ చేసిన జాన్వీ, సారా..

తాజాగా జబర్దస్త్ షోలో ఇంద్రజ తన పెళ్లి గురించి మాట్లాడింది. ఇటీవల రిలీజ్ అయిన ప్రోమోలో ఇంద్రజ మాట్లాడుతూ.. ”మాది ప్రేమ వివాహమే. మా పెళ్ళికి కేవలం 13 మంది అతిథులు మాత్రమే వచ్చారు. మా పెళ్లికి అయిన ఖర్చు అక్షరాలా రూ.7500 మాత్రమే” అని తెలిపింది. ఇక తన ప్రేమ వివాహం గురించి మరింత మాట్లాడింది. ఇంద్రజ ప్రేమ వివాహం గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలంటే ఎపిసోడ్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే.