కుక్కలకంటే హీనంగా : కరోనాతో బాధిత మృతదేహాన్ని ఈడ్చుకెళుతూ..

  • Published By: nagamani ,Published On : July 2, 2020 / 03:53 PM IST
కుక్కలకంటే హీనంగా : కరోనాతో బాధిత మృతదేహాన్ని ఈడ్చుకెళుతూ..

కరోనా సోకి చనిపోయిన మృతదేహాలను కుక్కల కంటే హీనంగా చూస్తున్న ఘటనలు హృదయాలను ద్రవింపజేస్తున్నాయి. కోవిడ్-19 బాధితుల శవాన్ని గుంతల్లోకి విసిరేసిన ఘటన మరవక ముందే.. క‌ర్ణాట‌క‌లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. పీపీఈ సూట్లు ధ‌రించిన వైద్య సిబ్బంది ఒక శ‌వాన్ని గ‌ట్టు పొలాల్లోంచి ఈడ్చుకుంటూ తీసుకెళ్తున్నారు. ఆ శవాన్నిలాక్కువెళుతున్నప్పుడు మధ్య మధ్యలో ఆగి ఆగి మ‌రీ లాక్కెళ్తున్నారు. ఈ సంఘ‌ట‌న కర్ణాటకలోని యాద‌గిరి జిల్లాలో చోటు చేసుకున్న‌ది.

ఈ శ‌వానికి అంత్య‌క్రియ‌లు చేయటానికి తీసుకెళ్తున్నార‌ట‌. గ్రామస్థులు ఆ శవాన్ని తమ పొలాల మధ్య పూడ్చకూడదని చెప్ప‌డంతో కుటుంబ స‌భ్యులు త‌మ పొలాల్లో పూడ్చ‌మ‌ని చెప్పారు. దీంతో ఆ పొలాల్లోకి అంబులెన్స్ వెళ్లే పరిస్థితి లేకపోవటంతో వైద్య సిబ్బంది శ‌వాన్ని లాక్కెళ్లారు.

కరోనా వచ్చిందనీ..అది సోకుతుందని భయపడి సొంత మనుషులు చనిపోతే ఇలా అనాథ శవాల్లా వదిలేయటం ఏమిటంటే ఇది చూసినవారంత విమర్శిస్తున్నారు.దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Read:క్యాన్సర్ తో గోల్డెన్ బాబా మృతి : కరోనా భయంతో అంత్యక్రియలకు రాని బంధువులు