Instagram Account Hack : మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయిందా? ఈ కొత్త టూల్ ద్వారా మీ అకౌంట్ ఈజీగా తిరిగి పొందవచ్చు.. ఇదిగో ప్రాసెస్..!

Instagram Account Hack : మీ ఇన్‌స్టాగ్రామ్ (Instagram) అకౌంట్ హ్యాక్ అయిందా? అయినా ఆందోళన అక్కర్లేదు. మీ ఇన్‌స్టాగ్రామ్ చాలా ఈజీగా తిరిగి పొందవచ్చు.

Instagram Account Hack : మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయిందా? ఈ కొత్త టూల్ ద్వారా మీ అకౌంట్ ఈజీగా తిరిగి పొందవచ్చు.. ఇదిగో ప్రాసెస్..!

Instagram account hacked_ Now there is a new tool to get your account back

Instagram Account Hack : మీ ఇన్‌స్టాగ్రామ్ (Instagram) అకౌంట్ హ్యాక్ అయిందా? అయినా ఆందోళన అక్కర్లేదు. మీ ఇన్‌స్టాగ్రామ్ చాలా ఈజీగా తిరిగి పొందవచ్చు. హ్యాక్ అయిన ఇన్‌స్టా (Instagram Account Hack) అకౌంట్లను తిరిగి పొందడానికి ఒక అద్భుతమైన పరిష్కారాన్ని ఫోటో షేరింగ్ యాప్ రూపొందించింది. ఇప్పుడు కొత్త ఫీచర్‌ను ఇన్‌స్టాగ్రామ్ అందుబాటులోకి తెచ్చింది. ఈ టూల్ ద్వారా వినియోగదారులు తమ హ్యాక్ అకౌంట్‌ను తిరిగి పొందవచ్చు. మీ అకౌంట్ హ్యాక్ అయిందని గుర్తించిన తర్వాత మీ మొబైల్ లేదా డెస్క్‌టాప్ నుంచి బ్రౌజర్‌ను ఓపెన్ చేయండి.. Instagram.com/hacked అని టైప్ చేయండి. మీ అకౌంట్ తిరిగి పొందడానికి కనిపించే ఆప్షన్లను ఫాలో కావాల్సి ఉంటుంది.

సాధారణంగా ఇన్ స్టా అకౌంట్లకు యాక్సెస్‌ను కోల్పోయినప్పుడు తరచుగా యూజర్లు భయాందోళనలకు గురవుతారు. అలాంటి భయాందోళన పరిస్థితులను దూరం చేసేందుకు ఇన్‌స్టాగ్రామ్ తమ యూజర్లను బ్రౌజర్ నుంచి నేరుగా సమస్యను పరిష్కరించుకునేందుకు అనుమతిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్ ఒక బ్లాగ్ పోస్ట్‌లో హ్యాక్ చేసిన అకౌంట్లను తిరిగి పొందేందుకు ఒక ఫీచర్‌ను ప్రారంభించినట్టు వెల్లడించింది. యూజర్లు తమ అకౌంట్లకు యాక్సస్ తిరిగి పొందడానికి వారి ఐడెంటిటీని ధృవీకరించాల్సిందిగా సూచిస్తుంది.

Read Also : Bluetooth Devices Hack : బ్లూటూత్ వాడుతున్నారా? బ్లూబగ్గింగ్‌తో మీ డివైజ్‌లు జాగ్రత్త.. హ్యాకర్లు మీ డేటాను హ్యాక్ చేయొచ్చు.. ఇలా ప్రొటెక్ట్ చేసుకోండి!

‘యాక్సెస్ సమస్యలను ఎదుర్కొంటున్న లేదా హ్యాక్ చేసిన అకౌంట్లకు సపోర్టు ఇచ్చేందుకు Instagram.com/hackedని క్రియేట్ చేసింది. యూజర్లు తమ అకౌంట్ యాక్సెస్ సమస్యలను నివేదించడానికి పరిష్కరించడానికి ఈ కింది విధంగా ఫాలో కావొచ్చు. మీరు మీ అకౌంట్ లాగిన్ చేయలేకపోతే అకౌంట్, మీ మొబైల్ ఫోన్ లేదా డెస్క్‌టాప్ బ్రౌజర్‌లో Instagram.com/hackedని ఎంటర్ చేయండి’ అని Instagram ఒక బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది.

Instagram account hacked_ Now there is a new tool to get your account back

Instagram account hacked_ Now there is a new tool to get your account back

హ్యాక్ అయిన మీ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ ఎలా తిరిగి పొందవచ్చో ఇప్పుడు చూద్దాం..

* మీరు మీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ఉపయోగించలేకపోతే, మీ మొబైల్ ఫోన్ లేదా డెస్క్‌టాప్ బ్రౌజర్‌లో Instagram.com/hackedని నమోదు చేయండి.
* మీరు ఎంచుకోవడానికి కొన్ని ఆప్షన్లు ఉన్నాయి.  మీ అకౌంట్ హ్యాక్‌కు గురైందని, మీ పాస్‌వర్డ్‌ను మర్చిపోయారని, టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ యాక్సస్ కోల్పోయారని లేదా మీ అకౌంట్ నిలిచిపోయిందని మీరు భావిస్తే ఇలా ఎంచుకోవచ్చు.
* బ్రౌజర్‌లో మీ సమస్యను ఎంచుకున్న తర్వాత, మీ అకౌంట్ యాక్సస్ తిరిగి పొందడంలో సాయపడేందుకు ఈ కింది విధంగా ఫాలో అవ్వండి.
* మీ ఐడెంటిటీని ధృవీకరించేందుకు.. మీ అకౌంట్ తిరిగి పొందడానికి ఇద్దరు ఇన్‌స్టాగ్రామ్ స్నేహితులను ఎంచుకోవడం ద్వారా మీ అకౌంట్ తిరిగి పొందవచ్చు.
* మీరు మీ స్నేహితులను ఎంచుకున్న తర్వాత Instagram వారికి రిక్వెస్ట్ పంపుతుంది. మీ స్నేహితులు ఇద్దరూ 24 గంటల్లోపు ధృవీకరిస్తే.. మీరు కొత్త పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
* మీ స్నేహితులు Instagram రిక్వెస్ట్‌పై స్పందించడంలో విఫలమైతే మీరు మళ్లీ మరో ఇద్దరు స్నేహితులను ఎంచుకోవాల్సి ఉంటుంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : QR Code Scam : QR కోడ్ స్కామ్‌తో తస్మాత్ జాగ్రత్త.. ఇలాంటి స్కామర్ల నుంచి ఎలా సేఫ్‌గా ఉండాలి? ఎలా గుర్తించాలో తెలుసా?