iPhone 16 USB Type-C : 2025లో USB టైప్-C ఛార్జింగ్ పోర్టుతో రానున్న ఆపిల్ ఐఫోన్ 16.. ఎందుకో తెలుసా?
iPhone 16 USB Type-C : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) తమ బ్రాండ్ ఐఫోన్ (iPhone)లలో ఛార్జర్ లేకుండానే ప్రవేశపెడుతోంది. ఆపిల్ ఛార్జింగ్ విధానంపై ప్రపంచ దేశాల్లో వ్యతిరేకత నెలకొంది.

iPhone 16 launching in 2025 could come with USB Type-C charging port, here’s why
iPhone 16 USB Type-C : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) తమ బ్రాండ్ ఐఫోన్ (iPhone)లలో ఛార్జర్ లేకుండానే ప్రవేశపెడుతోంది. ఆపిల్ ఛార్జింగ్ విధానంపై ప్రపంచ దేశాల్లో వ్యతిరేకత నెలకొంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం గత రెండు నెలలుగా దేశంలో సాధారణ ఛార్జింగ్ విధానాన్ని ప్రవేశపెట్టాలనే యోచనలో ఉంది. ఇప్పటికే యూరోపియన్ యూనియన్ ఒక సాధారణ ఛార్జర్ నియమాన్ని ప్రకటించింది. ఇందులో ఆపిల్‌తో సహా స్మార్ట్‌ఫోన్ తయారీదారులు తమ ఫోన్ల కోసం Type-C పోర్ట్‌కి మారాలి. ప్రస్తుతం, అన్ని ఐఫోన్ మోడల్‌లు (iPhone Models) లైటనింగ్ పోర్ట్‌తో వస్తున్నాయి. కానీ, ఈయూ నియమం అమల్లోకి రావడంతో 2025 నుంచి ప్రారంభమయ్యే ఐఫోన్లు Type-C పోర్ట్‌కి మారాలి.
భారత్ సైతం ఈయూ అడుగుజాడల్లో నడుస్తోంది. నివేదిక ప్రకారం.. ఇండస్ట్రీ వాటాదారులతో పాటు వినియోగదారుల వ్యవహారాల శాఖ రెండు ఛార్జింగ్ ఆప్షన్లతో పరిశీలిస్తోంది. అందులో ఒకటి స్మార్ట్ఫోన్ల కోసం.. రెండవది వేరబుల్ డివైజ్‌లు.. వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ ప్రకారం.. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లు, మరిన్నింటిలో USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్‌ల కోసం క్వాలిటీ ప్రమాణాలను రూపొందించింది.

iPhone 16 launching in 2025 could come with USB Type-C charging port, here’s why
మరోవైపు.. వేరబుల్ వస్తువులకు కూడా ఉమ్మడి ఛార్జింగ్ విధానంపై భారత ప్రభుత్వం పనిచేస్తోందని చెబుతున్నారు. ప్రస్తుతం, చాలా వేరబుల్ డివైజ్‌లు వివిధ రకాల ఛార్జింగ్ పోర్ట్‌లతో వస్తున్నాయి. గత సమావేశంలో, స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లు మొదలైన వాటికి ఛార్జింగ్ పోర్ట్‌గా USB టైప్-Cని స్వీకరించడంపై వాటాదారుల మధ్య విస్తృత ఏకాభిప్రాయం ఏర్పడింది. టైప్-C ఛార్జర్‌కు సంబంధించిన ప్రమాణాలను BIS తెలియజేసిందని సింగ్ చెప్పారు. ఇ-వ్యర్థాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో EU ఉమ్మడి ఛార్జింగ్ విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.
ఈయూ బాటలో భారత్? :
భారత ప్రభుత్వం కూడా అదే లక్ష్యంతో పనిచేస్తోంది. Meity తన ‘(Electronic Waste and India)’ నివేదికలో భారత్ e-వ్యర్థాలు 10 శాతం చొప్పున పెరుగుతున్నాయని పేర్కొంది. 2020-2021 సంవత్సరంలో భారత్ 3.4 లక్షల టన్నుల ఇ-వ్యర్థాలను ప్రాసెస్ చేసినట్లు వెల్లడించింది. సాధారణ ఛార్జింగ్ విధానాన్ని ప్రవేశపెట్టడంతో రాబోయే సంవత్సరాల్లో కనీసం పాక్షికంగానైనా ఈ-వ్యర్థాల ఉత్పత్తిని తగ్గించాలని భారత ప్రభుత్వం భావిస్తోంది. EU లేటెస్ట్ ఆదేశాల ప్రకారం.. సభ్య దేశాలలో విక్రయించే iPhoneలతో సహా అన్ని స్మార్ట్ఫోన్లు డిసెంబర్ 28, 2024 నుంచి సాధారణ USB టైప్-C ఛార్జర్‌ను కలిగి ఉండాలి.

iPhone 16 launching in 2025 could come with USB Type-C charging port
భారత ప్రభుత్వం సాధారణ ఛార్జింగ్‌ను ప్రవేశపెట్టడానికి కచ్చితమైన సమయాన్ని వెల్లడించలేదు. దేశంలోని విధానం, EU కాలపరిమితికి అనుగుణంగా అమలు అయ్యే అవకాశం ఉంది. మొబైల్, ఎలక్ట్రానిక్స్ తయారీదారులు గ్లోబల్ సరఫరా గొలుసు ద్వారా యూరోపియన్ యూనియన్ టైమ్‌లైన్‌తో 2024కి అనుగుణంగా ఉండాల్సిన అవసరం ఉందని సింగ్ చెప్పారు. USB టైప్-C అన్ని ఫోన్లకు రాబోయే ఛార్జింగ్ పోర్ట్‌గా మారడంతో Apple అత్యంత ప్రభావితమైన బ్రాండ్ కావచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా ఆండ్రాయిడ్ ఫోన్లు USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్‌తో వస్తున్నాయి.
ఇప్పటివరకు లాంచ్ చేసిన ఆపిల్ ఐఫోన్ మోడల్స్ లైటనింగ్ పోర్ట్‌తో మార్కెట్లోకి లాంచ్ అయ్యాయి. సాధారణ ఛార్జర్ విధానం అమలులోకి వచ్చిన తర్వాత ఐఫోన్లు USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్ కోసం లైటనింగ్ పోర్ట్‌ను డిచ్ చేయవలసి ఉంటుంది. USB టైప్-C పోర్ట్‌తో వస్తున్న ఆపిల్ నుంచి వచ్చిన మొదటి ఫోన్ iPhone 16 అని నివేదికలు సూచిస్తున్నాయి. ఆపిల్ దీనిపై ఎలాంటి వివరాలను వెల్లడించలేదు.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..