IPL 2021 : ఉత్కంఠభరిత పోరులో కోల్‌కతాదే విజయం

ఢిల్లీ - కోల్‌కతా మధ్య జరిగిన క్వాలిఫయర్-2లో కోల్‌కతా ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది.

IPL 2021 : ఉత్కంఠభరిత పోరులో కోల్‌కతాదే విజయం

Ipl 2021 (2)

IPL 2021 : ఢిల్లీ – కోల్‌కతా మధ్య జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. ఈ ఉత్కంఠ పోరులో కోల్‌కతా విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో ధవన్ (36), శ్రేయాస్ అయ్యర్ (30) పరుగులు చేయగా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. 136 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా ఆది నుంచి దూకుడుగా ఆడింది. ఓపెనర్లు శుబ్‌మాన్‌ గిల్, వెంకటేష్ అయ్యర్ దూకుడుగా ఆడారు. ఓపెనర్లే మ్యాచ్‌ని గెలిపిస్తారని అందరు అనుకున్నారు. కానీ 12 ఓవర్లలో జట్టు స్కోరు 96 పరుగులు వద్ద వెంకటేష్ అయ్యర్ కగిసో రబాడా బౌలింగ్‌లో వెనుతిరిగాడు.

చదవండి : Golden Bride : ఈమె బంగారు పెళ్లికూతురు.. వంటిపై 60కేజీల పసిడి

అనంతరం బ్యాటింగ్‌కి వచ్చిన నితీష్ రానా 13 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అన్రిచ్ బౌలింగ్‌‍లో షిమ్రోన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాటపట్టారు. ఆ వెంటనే శుబ్‌మాన్‌ గిల్ కూడా పెవిలియన్ బాట పట్టాడు. 46 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద శుబ్‌మాన్‌ గిల్, అవేశ్ ఖాన్ బౌలింగ్‌లో రిషబ్ పంత్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. వరుసగా రెండు వికెట్లు కోల్పోవడంతో కోల్‌కతా ఆటగాళ్లలో గందరగోళం నెలకొంది.

చదవండి : IPL 2021: కోహ్లీ.. డివిలియర్స్ నా కోరిక తీర్చలేకపోయారు – సెహ్వాగ్

ఆ వెంటనే క్రిస్‌లోకి వచ్చిన దినేష్ కార్తీక్ 3 బంతులు ఆడి ఒక్కపరుగు కూడా చేయకుండా వెనుదిరిగాడు. చివరి రెండు బంతుల్లో 6 పరుగులు చేయాల్సి ఉండగా రాహుల్ సిక్స్ కొట్టాడు దీంతో ఒక బంతి మిగిలి ఉండగానే కోల్‌కతా విజయం సాధించింది కోల్‌కతా ఓపెనర్లు గిల్ 46 పరుగులు చేయగా వెంకటేష్ అయ్యర్ 55 పరుగులు చేశారు. ఇక ఢిల్లీ బౌలర్లలో అశ్విన్ 2, అన్రిచ్ 2, కగిసో రబాడా 2, అవేశ్ ఖాన్ 1 వికెట్ తీశారు. 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది కోల్‌కతా.